
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా జూన్ 20న విడుదలైంది. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తొలిరోజు అంచనాలకు మించిన విజయాన్ని సాధించింది.
Key Points
‘కుబేర’ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ₹30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
ధనుష్, నాగార్జున, రష్మిక నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది.
ఈ కలెక్షన్లు కొనసాగితే ధనుష్ కెరీర్ లోనే ‘కుబేర’ ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది.
కుబేర మూవీ విడుదల
శేఖర్ కమ్ముల(Sekar Kammula) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush), కింగ్ నాగార్జున(Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘కుబేర’(Kubera) మూవీ జూన్ 20న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై ముందునుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే బిచ్చగాడికి, కుబేరుడికి మధ్య సాగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో ధనుష్ తన నటనతో అదరగొట్టేశాడు. బిచ్చగాడిగా పాత్రలో జీవించేశాడు. ధనుష్‌పై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు నాగార్జున, రష్మికల పర్‌ఫార్మెన్స్‌ని కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు.
అయితే తొలి రోజే ఆ అంచనాలను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹30 కోట్లు(అంచనా) గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘శ్రీనివాస గోవిందా.. ప్రపంచవ్యాప్తంగా ₹30 కోట్లు+ మొదటి రోజు వసూళ్లు (అంచనా).. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్‌ను రగిలించనున్న కోలాహలానికి ఇది ప్రారంభం మాత్రమే.. ఏకగ్రీవ మెగా బ్లాక్‌బస్టర్’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ కలెక్షన్స్ అలానే కొనసాగితే ధనుష్ కెరీర్‌లోనే కుబేర మంచి బ్లాక్ బస్టర్ హిట్‌గా మిగిలిపోతుంది. Link
తొలిరోజు వసూళ్లు
నటీనటుల ప్రదర్శన
మొత్తానికి, ‘కుబేర’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని చేసింది. ఈ ట్రెండ్ కొనసాగితే ధనుష్ కెరీర్ లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.


Kajal Aggarwal’s Viral Bomb: Slams South Cinema’s Navel Obsession