|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిల్‌ రాజు చేతికి ‘వార్‌ 2’.. కూలీ ఎఫెక్ట్‌తో పక్కా ప్లాన్‌

Published: 10-06-2025, 1:32 AM
దిల్‌ రాజు చేతికి 'వార్‌ 2'.. కూలీ ఎఫెక్ట్‌తో పక్కా ప్లాన్‌

ఆగష్టు 14న విడుదల కానున్న ‘వార్ 2’ చిత్రం తెలుగు హక్కుల కోసం యష్ రాజ్ ఫిలింస్ భారీ ధర నిర్దేశించింది. కానీ, ‘కూలీ’ సినిమా విడుదలతో పోటీని దృష్టిలో ఉంచుకుని, వారు డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

Key Points

1

వార్ 2 తెలుగు హక్కుల కోసం 120 కోట్లకు పైగా డిమాండ్.

2

కూలీ సినిమాతో పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్లాన్.

4

ఉత్తరాంధ్ర హక్కులు దిల్ రాజు సంస్థకు అప్పగించబడ్డాయి.

వార్ 2 తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులు

బాలీవుడ్‌ స్పై యాక్షన్  డ్రామా చిత్రం ‘వార్‌ 2’ ఆగష్టు 14న విడుదల కానుంది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో  బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యష్ రాజ్ ఫిలింస్ సొంతంగానే వార్‌2 ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట.

కూలీ సినిమాతో పోటీ

వార్‌2 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల  హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యష్‌ రాజ్‌ ఫిలింస్‌  కోట్ చేసింది. అయితే, చాలా పక్కా ప్లాన్‌తో ఆ సంస్థ అడుగులేస్తుంది.  రజనీకాంత్‌, నాగార్జున,  లోకేష్ కనకరాజ్‌ల సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తుండటంతో సౌత్‌ ఇండియాలో వార్‌2కు పోటీ తప్పదు.  అందుకే వార్‌2 చిత్ర యూనిట్‌ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్‌.

యష్ రాజ్ ఫిలింస్ వ్యూహం

డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో వార్ 2 సరికొత్త ప్లాన్‌తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముంబై నుంచే థియేటర్ల యజమానులతో వారు డీల్‌ సెట్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అగ్రిమెంట్‌లు కూడా స్టార్ట్ చేసేశారు. కానీ,  ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకు ఇచ్చారని తెలుస్తోంది. వార్‌2 చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు  ఇవ్వాలా లేదా తామే పంపిణీ చేద్దామా అనే అంశాన్ని ప్రస్తుతానికి ఆ టీమ్‌ పక్కన పెట్టేసింది.

చివరగా, ‘వార్ 2’ తెలుగు డిస్ట్రిబ్యూషన్ విషయంలో యష్ రాజ్ ఫిలింస్ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ‘కూలీ’ సినిమాతో పోటీని దృష్టిలో ఉంచుకుని వారు తమ వ్యూహాన్ని రూపొందించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.