|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుబేర ఫస్ట్ రివ్యూ: అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్- ధనుష్‌ను మించిన నటుడు ఇండియాలోనే లేడు- సూపర్ స్టార్ కూడా నేర్చుకోవాలంటూ!

Published: 19-06-2025, 4:14 AM
కుబేర ఫస్ట్ రివ్యూ: అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్- ధనుష్‌ను మించిన నటుడు ఇండియాలోనే లేడు- సూపర్ స్టార్ కూడా నేర్చుకోవాలంటూ!

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర సినిమాపై బాలీవుడ్ విమర్శకుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సినిమా కథ, ధనుష్ నటనను ప్రశంసించారు.

Key Points

1

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన కుబేర సినిమా

2

ఉమైర్ సంధు ఇచ్చిన ఫస్ట్ రివ్యూలో 3.5 స్టార్ రేటింగ్

4

జూన్ 20న పాన్ ఇండియా రిలీజ్

కుబేర సినిమా ఫస్ట్ రివ్యూ

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో కుబేర ఒకటి. టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారి కలిసి నటించిన సినిమానే కుబేర. ఈ సినిమాకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కించిన కుబేర సినిమాను అమిగోస్ క్రియేషన్స్, ఎస్‌వీసిఎల్ఎల్‌పీ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించిన నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుబేర జూన్ 20న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా థియేటర్లలో విడుదల కానుంది.

ఉమైర్ సంధు రివ్యూ

థియేట్రికల్ రిలీజ్‌కు ఒకటిరెండు రోజుల ముందుగానే కుబేర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్రిటిక్‌గా పేరు తెచ్చుకున్న ఉమైర్ సంధు కుబేరా మూవీ రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కుబేర ఫస్ట్ రివ్యూ అంటూ పోస్టులు షేర్ చేశారు ఉమైర్ సంధు. మరి ఉమైర్ సంధు ఇచ్చిన కుబేర ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

” ఫస్ట్ రివ్యూ ఆఫ్ కుబేరా: నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా అద్భుతంగా నటించిన పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కుబేర. కుబేర స్టోరీ ఎంగేజింగ్‌గా ఉంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ధనుష్ నుంచి విలక్షణమైన నటనను ఆమీర్ ఖాన్ నేర్చుకోవాలి. కచ్చితంగా చూడండి” అని రాసుకొచ్చిన ఉమైర్ సంధు కుబేర మూవీకి ఐదుకు 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

ధనుష్ నటనకు ప్రశంసలు

మరొక ట్వీట్‌లో “నటనలో విలక్షణత చూపించే విధానంలో ఇండియాలో ఇప్పటికీ నెంబర్ వన్ నటుడు అంటే ధనుష్ మాత్రమే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా హేటర్స్” అని ఉమైర్ సంధు షాకింగ్‌గా రాసుకొచ్చారు. మొత్తానికి కుబేర సినిమాలో ధనుష్ యాక్టింగ్ అదిరిపోయిందని, అతనికి మించిన నటుడు ఇండియాలో ఎవరు లేరన్నట్లుగా ఉమైర్ సంధు ట్వీట్స్ ఉన్నాయి.

ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను సైతం ధనుష్ దగ్గర యాక్టింగ్ నేర్చుకోమన్నట్లుగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక కుబేర మూవీ ఫస్ట్ రివ్యూ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తంగా, కుబేర సినిమాపై ఉమైర్ సంధు ఇచ్చిన సానుకూల రివ్యూ సినిమాపై అంచనాలను పెంచింది. ధనుష్ నటన ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.