|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెండో రోజు పెరిగిన కుబేర కలెక్షన్స్- సూర్య మూవీని బీట్ చేసిన ధనుష్ చిత్రం- ఎన్ని కోట్లు వచ్చాయి? తెలుగులో హిట్ కావాలంటే?

Published: 21-06-2025, 11:40 PM
రెండో రోజు పెరిగిన కుబేర కలెక్షన్స్- సూర్య మూవీని బీట్ చేసిన ధనుష్ చిత్రం- ఎన్ని కోట్లు వచ్చాయి? తెలుగులో హిట్ కావాలంటే?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ప్రతిస్పందనను అందుకుంటోంది. తొలి రోజు భారీ కలెక్షన్ల తర్వాత, రెండో రోజు కూడా కలెక్షన్లు పెరిగాయి. ఈ సినిమా తెలుగులో హిట్ కాగలదా?

Key Points

1

కుబేర మూవీ రెండో రోజు కలెక్షన్స్‌లో పెరుగుదల నమోదు.

2

సూర్య సినిమా 'రెట్రో' కంటే కుబేరకు ఎక్కువ కలెక్షన్స్.

4

తెలుగులో హిట్ కావడానికి ఇంకా రూ. 16 కోట్లు రాబట్టాల్సి ఉంది.

కుబేర మూవీ రెండో రోజు కలెక్షన్స్ విశ్లేషణ

డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా , జిమ్ సర్బ్ నటించిన కుబేర మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కుబేర కలెక్షన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

కుబేర మూవీకి తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ. 30 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సోషల్ మీడియాలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే, కేవలం ఇండియాలో ఓపెనింగ్ డే నాడు కుబేర మూవీకి రూ. 14.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది.

ఈ 14.75 కోట్లలో తెలుగు నుంచి రూ. 10 కోట్లు, తమిళం ద్వారా రూ. 4.5 కోట్లు, కన్నడ వెర్షన్‌కు రూ. 2 లక్షలు, హిందీ బెల్ట్‌లో రూ. 23 లక్షలు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది కుబేర . అలాగే, ఓవర్సీస్ నుంచి ఓపెనింగ్ డే నాడు ఈ సినిమాకు రూ. 10.15 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

సూర్య మూవీతో పోలిక

ఇక రెండో రోజు శనివారం (జూన్ 21) భారత్‌లో కుబేర మూవీకి రూ. 16 కోట్ల నెట్ వసూల్లు వచ్చినట్లు సమాచారం. అంటే, తొలి రోజుతో పోలిస్తే ఇండియాలో రెండో రోజున కుబేర నెట్ కలెక్షన్స్ పెరిగాయి. ఇక రెండు రోజుల్లో భారత్‌లో కుబేర మూవీకి రూ. 30.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ వెల్లడించింది.

అంటే, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ మూవీకి రెట్రో కంటే కుబేర కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. రెట్రో మూవీ రెండు రోజుల్లో ఇండియాలో రూ. 27 కోట్లు వసూలు చేసింది. అంటే, 2 రోజుల్లో 3 కోట్లకుపైగా కలెక్షన్స్‌తో రెట్రో మూవీని కుబేర బీట్ చేసింది.

తెలుగులో హిట్ అవ్వడానికి అవసరమైన కలెక్షన్స్

ఇక వరల్డ్ వైడ్‌గా కుబేర మూవీకి రెండు రోజుల్లో రూ. 50 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అలాగే, కుబేర తెలుగు వెర్షన్‌కు రెండో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ 66.19 శాతం నమోదు అయింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం 71.65 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది కుబేర.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కుబేర సినిమాకు రూ. 33 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ. 34 కోట్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. రెండు రోజుల్లో తెలుగులో కుబేరకు రూ. 18 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలుగులో కుబేర హిట్ కావాలంటే ఇంకా రూ. 16 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.

కుబేర సినిమా రెండో రోజు కలెక్షన్లు ఆశాజనకంగా ఉన్నాయి. తెలుగులో హిట్‌గా నిలవడానికి ఇంకా కొంత దూరం ఉంది. మరిన్ని రోజుల తర్వాత పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.