
అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన ‘కుబేర’ చిత్రం నుంచి రెండో పాట ‘అనగనగా కథ’ విడుదలైంది. ఈ పాట లిరిక్స్, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా జూన్ 20న విడుదల కానుంది.
Key Points
నాగార్జున, ధనుష్, రష్మిక నటించిన ‘కుబేర’ సినిమా రెండో పాట విడుదలైంది.
‘అనగనగా కథ’ అనే ఆకట్టుకునే లిరిక్స్‌తో ఈ పాట సినిమా కథాంశాన్ని వివరిస్తుంది.
ఆస్కార్ విజేత చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ పాటకు ప్రత్యేకత.
జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో ‘కుబేర’ సినిమా విడుదల కానుంది.
‘కుబేర’ సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్
అక్కినేని నాగార్జున(Nagarjuna), ధనుష్(Dhanush), రష్మిక మందన్న(Rashmika Mandanna) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’9Kubera). ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘అనగనగా కథ’(Anaganaga Katha) అంటూ సాగే ఈ సాంగ్ కుబేర చిత్ర ప్లాట్‌ను విశ్లేషిస్తోంది. ఈ సినిమా ఇతివృత్తం మనకు ఈ పాటలో కనిపిస్తుంది. ఆస్కార్ విజేత చంద్రబోస్(Chandra Bose) మరోసారి తనదైన పదాలతో ఈ పాటను రాసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం ఈ పాటను మరింత ఆసక్తికరంగా మార్చింది. కాగా ఈ మూవీను జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
‘అనగనగా కథ’ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి
జూన్ 20న ‘కుబేర’ సినిమా విడుదల
చివరగా, ‘కుబేర’ సినిమా రెండో పాట విడుదలతో అంచనాలు మరింత పెరిగాయి. జూన్ 20 వరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


