|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో దుమ్ము రేపుతున్న రూ.132 కోట్ల థ్రిల్లర్ మూవీ కుబేర.. వచ్చీ రాగానే టాప్‌లోకి.. తొలి రెండు స్థానాల్లోనూ ఆ సినిమానే..

Published: 21-07-2025, 6:41 AM
ఓటీటీలో దుమ్ము రేపుతున్న రూ.132 కోట్ల థ్రిల్లర్ మూవీ కుబేర.. వచ్చీ రాగానే టాప్‌లోకి.. తొలి రెండు స్థానాల్లోనూ ఆ సినిమానే..

రూ.132 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘కుబేర’ మూవీ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ థ్రిల్లర్, వచ్చిన వెంటనే టాప్ ట్రెండింగ్‌లోకి ఎదిగింది.

Key Points

1

ఓటీటీలోకి వచ్చిన వెంటనే కుబేర మూవీ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

2

తెలుగు, తమిళ వెర్షన్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

4

ధనుష్, నాగార్జున, రష్మిక నటనకు ప్రేక్షకుల ప్రశంసలు.

కుబేర మూవీ ఓటీటీ విజయం

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి గత వారమే అడుగుపెట్టిన తెలుగు థ్రిల్లర్ మూవీ కుబేర (Kuberaa). గత శుక్రవారం (జులై 18) ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. వచ్చీ రాగానే సత్తా చాటుతోంది. ప్రైమ్ వీడియోలో తొలి రెండు స్థానాల్లోనూ ఈ సినిమానే నిలవడం విశేషం.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నాలాంటి వాళ్లు నటించిన మూవీ కుబేర. జూన్ 20న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.132 కోట్లు వసూలు చేసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి ఓటీటీలోనూ అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది.

బాక్సాఫీస్ నుండి ఓటీటీ వరకు

తెలుగు వెర్షన్ తొలి స్థానంలో, తమిళ వెర్షన్ రెండోస్థానంలో ఉండటం విశేషం. సుమారు మూడు గంటల నిడివితో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర తమిళ వెర్షన్ కు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది.

కుబేర మూవీ పాన్ ఇండియా రిలీజ్ గా ఈ ఏడాది సంచలనం సృష్టించింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ తో నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషనే ఆసక్తి రేపగా.. తర్వాత సినిమా కూడా అంచనాలను అందుకోవడంతో మూవీ పెద్ద హిట్ అయింది. లక్ష కోట్ల స్కామ్ అనే ఇంట్రెస్టింగ్ కథతో కుబేర మూవీ తెరకెక్కింది.

నటీనటుల ప్రదర్శన

ఎంతో విలువైన ఆయిల్ రిజర్వ్ లను చేజిక్కించుకోవడానికి ఓ బిలియనీర్ ప్రభుత్వ పెద్దలకు రూ. లక్ష కోట్ల లంచం ఇవ్వాలనుకోవడం, దీనికి ఓ మాజీ సీబీఐ ఆఫీసర్ సహకరించడం, దీనికోసం నలుగురు బిచ్చగాళ్లనే బినామీలుగా మార్చడం అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఈ కుబేర. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటనకు ప్రశంసలు దక్కాయి.

మరో నేషనల్ అవార్డు ఖాయం అని తేల్చేశారు. అటు నాగార్జున, రష్మిక కూడా బాగా చేశారని ప్రేక్షకులు ప్రశంసించారు. నిడివి ఎక్కువైనా.. శేఖర్ కమ్ముల మార్క్ మూవీని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ థియేటర్లలో చూసి ఉండకపోతే వెంటనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూసేయండి.

కుబేర మూవీ థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల అభిమానానికి నిదర్శనంగా ఈ సినిమా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.