|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాశ్మీర్‌లో స్టార్‌ హీరోయిన్‌ త్రిష పేరుతో ఒక గ్రామం.. వైరల్‌ అవుతున్న ఫోటో

Published: 05-06-2025, 5:48 AM
కాశ్మీర్‌లో స్టార్‌ హీరోయిన్‌ త్రిష పేరుతో ఒక గ్రామం.. వైరల్‌ అవుతున్న ఫోటో

దక్షిణాది సినిమా రంగంలో ప్రముఖ నటి త్రిషకు లడక్‌లో తన పేరుతో ఒక గ్రామం ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఒక అభిమాని తీసిన ఆ గ్రామం బోర్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

త్రిషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు

కోలీవుడ్‌ నటి త్రిషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన పేరే ఒక బ్రాండ్‌ అనే రేంజ్‌కు ఒక హీరోయిన్‌గా ఆమె ఎప్పుడో చేరిపోయారు. అయితే అంతకుమించి అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సినిమా కథానాయికలు పదేళ్లు అగ్ర కథానాయికలుగా రాణించడం కష్టతరం. అలాంటిది త్రిష ఏకంగా 20 ఏళ్లకు పైగా క్రేజీ స్టార్‌గా వెలిగిపోతుండడం విశేషం. పెరగని వయసు, తగ్గని గ్లామర్‌ త్రిష సొంతం. ఈమె తాజాగా అజిత్‌ సరసన నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం  విడుదలై కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నారు.

లడక్‌లో త్రిష పేరుతో గ్రామం

మరోవైపు మణితర్నం దర్శకత్వంలో కమలహాసన్‌ సరసన నటించిన థగ్‌లైఫ్‌ చిత్రం జూన్‌ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చేసింది. సూర్యకు జోడీగా నటిస్తున్న మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మలయాళం, కన్నడం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది భాషల్లో తగ్గేదేలే అంటూ తన జోరు సాగిస్తున్నారు. త్రిషకు చాలా పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. మొదట్లోనే మిస్‌ చైన్నె కిరీటాన్ని గెలుచుకున్న త్రిషను ఇప్పటివరకూ ఒక బ్రాండ్‌ అనే అనుకున్నాం. అంతకుమించి అని ఇప్పుడు తెలిసింది.

సోషల్ మీడియాలో వైరల్

ఈ బ్యూటీ పేరుతో ఒక ఊరే ఉండడం విశేషం. అది ఎక్కడో తెలుసా లడక్‌లో, అవును ఆక్కడ త్రిష పేరుతో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరుతో ఉన్న బోర్డును ఒక అభిమాని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. అందులో త్రిష.. మీ పేరుతో లడక్‌లో ఒక ఊరు ఉంది. మీకు తెలుసా? తెలిస్తే మీరు వెంటనే ఆ ఊరుకు వస్తారు’ అని అతను పేర్కొన్నాడు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

త్రిష అభిమానులకు ఈ వార్త చాలా ఆనందాన్నిచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్రిష స్వయంగా ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.