|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లక్ష్మీదేవి కొన్ని ఇళ్ళను ఎందుకు వీడుతుంది? సంపద ఆకర్షించే రహస్యాలు!

Published: 16-09-2025, 10:51 AM
లక్ష్మీదేవి కొన్ని ఇళ్ళను ఎందుకు వీడుతుంది? సంపద ఆకర్షించే రహస్యాలు!

లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికీ కావాలి. కానీ కొందరి ఇళ్లను ఆమె ఎందుకు వీడుతుంది? ఇంటి శుభ్రత, కృతజ్ఞతా భావం, దానధర్మాల పాత్రను తెలుసుకుందాం.

Key Points

1

ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం

2

కృతజ్ఞతా భావంతో జీవించడం

4

లక్ష్మీదేవి పూజతో అనుగ్రహం పొందడం

ఇంటి శుభ్రత: లక్ష్మీదేవికి ప్రీతికరమైనది

ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొంతమంది ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు లక్ష్మీదేవి కొందరి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది? దానికి కారణాలేంటి అనే దాని గురించి తెలుసుకుందాం.

1.చెత్తా చెదారంతో నిండి ఉన్న ఇల్లు:

ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండడానికి ఇష్టపడదు. ఉతకని బట్టలు, అనవసరమైన కాగితాలు, పనికిరాని సామాన్లు ఇలా వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. లేకపోతే వీటి కారణంగా ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పైగా లక్ష్మీదేవి కూడా అలాంటి ఇంటిని ఇష్టపడదు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, చెత్తను తొలగించాలి.

2.కృతజ్ఞతా భావం లేకపోవడం:

ఎవరి వద్ద అయితే కృతజ్ఞతా భావం ఉండదో, వారి దగ్గర ఉండడానికి లక్ష్మీదేవి ఏ మాత్రం ఇష్టపడదు. మీరు అనుకున్నట్లు అన్నీ జరుగుతున్నప్పుడు ఒక్క కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. కృతజ్ఞతా భావం లేని వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. వారి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

కృతజ్ఞతా భావం: సంపదకు మార్గం

చాలా మంది అసలు నిజాన్ని మర్చిపోయి డబ్బు వెనక పరిగెడుతూ ఉంటారు. కానీ డబ్బు వెనక పరిగెత్తే వారితో లక్ష్మీదేవి ఉండదు. డబ్బు వెనక పరిగెత్తడానికి బదులుగా మీ పని, మీ కుటుంబ జీవితం, మీరు ఇష్టపడే వాటిని ఇలా ప్రతిదానితో ముందుకు వెళ్ళిపోవాలి. అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. నిజానికి ఈ విధానాన్ని నమ్మాలి. ఇలా జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మీదేవి మీతోనే ఉంటుంది.

మనం సంపాదించే కొంత డబ్బును దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలి. లక్ష్మీదేవి అలాంటి వారిని ఇష్టపడుతుంది. వారితో ఉంటుంది. అలాంటి ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. అదే విధంగా ఎప్పుడైనా దానం చేస్తే, మీరు చేసే దానం గురించి ఇతరులతో పంచుకోకండి.

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలని పాటించవచ్చు:

1.ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పాదాలను వేయడం:

పూజ గదిలో ముగ్గుతో లక్ష్మీదేవి పాదాలు వేయడం, స్టిక్కర్లు వంటి వాటిని అతికించడం వంటివి చెయ్యచ్చు. వీటి ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయి. ప్రశాంతత కూడా ఉంటుంది.

గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదువుతే కూడా లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది. కమల గట్టమాలతో ఈ మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. అదే విధంగా లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఈ మంత్రాన్ని జపిస్తే పేదరికం నుంచి బయటపడటానికి అవుతుంది.

దానధర్మాలు: లక్ష్మీదేవి అనుగ్రహం

నేతితో దీపారాధన చేస్తే కూడా లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. అదే విధంగా లక్ష్మీదేవికి కమల పూలను కూడా సమర్పించండి.

లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, సానుకూల శక్తి ప్రవహించడానికి దక్షిణావర్తి శంఖాన్ని పూజ గదిలో పెట్టండి. గవ్వలు కూడా పూజ గదిలో ఉండేటట్టు చూసుకోండి. ఇవి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగేలా చేస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.

5.తులసి మొక్కని పూజించండి:

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలగడానికి తులసి మొక్కని పూజించండి. తులసి మొక్క ఎదుట దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. సుఖ సంతోషాలను అందిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఇంటి శుభ్రత, కృతజ్ఞతా భావం, దానధర్మాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి దారితీస్తాయి. ఈ సూచనలను పాటించి సంపదను ఆకర్షించుకోండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.