
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? ఫిట్‌నెస్ నిపుణులు, పలు అధ్యయనాల ప్రకారం, లేట్ నైట్ డిన్నర్ జీవక్రియను దెబ్బతీసి, ఊబకాయానికి దారితీస్తుంది. నిద్ర, హార్మోన్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
Key Points
రాత్రి 10 గంటల తర్వాత డిన్నర్ అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆలస్యంగా భోజనం నిద్ర చక్రాన్ని, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి జీవక్రియను నెమ్మదిస్తుంది.
ఇన్సులిన్ స్పందన తగ్గడం, జీర్ణక్రియ నెమ్మదించడం, కొవ్వు నిల్వ పెరగడం వంటివి ప్రధాన సమస్యలు.
ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం రాత్రి 8-9 గంటలలోపు భోజనం పూర్తిచేసి, తేలికపాటి కదలిక ఉండాలి.
ఆలస్యంగా భోజనం – జీవక్రియపై ప్రభావం
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? అయితే మీరు అధిక బరువు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. సెల్ మెటబాలిజం (Cell Metabolism)జర్నల్ సహా పలు ఇతర అధ్యయనాలు సైతం ఇదే చెబుతున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత డిన్నర్ చేసే అలవాటు అధిక బరువు లేదా ఊబకాయం సమస్యకు దారితీస్తుందని పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఇది నిద్ర చక్రాన్ని ఆటంకపరుస్తుంది. నిద్ర ఆటంకాలు జీవక్రియను నెమ్మదిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఫలితంగా బరువు పెరగడం సులభం ప్రారంభం అవుతుంది.
లేట్‌నైట్ డిన్నర్ అనేది జీవక్రియ (Metabolism)ను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. నిజానికి మన శరీరం రోజువారీ సర్కాడియన్ రిథమ్ (24 గంటల బయోలాజికల్ క్లాక్) ప్రకారం పని చేస్తుంది. పగటిపూట జీవక్రియ వేగంగా ఉంటుంది, రాత్రి సమయంలో నెమ్మదిస్తుంది. కాబట్టి రాత్రి ఆలస్యంగా (ముఖ్యంగా 10 గంటల తర్వాత) భోజనం చేస్తే శరీరం ఆ కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయలేకపోవడంవల్ల అధిక బరువు లేదా ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
*ఇన్సులిన్ స్పందన తగ్గడం: రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ సరిగా పని చేయకపోవచ్చు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, కొవ్వు నిల్వ అవకాశం ఎక్కువవుతుంది.
నిద్ర, ఇన్సులిన్, జీర్ణక్రియపై దుష్ప్రభావాలు
*నిద్రపై ప్రభావం: లేట్ నైట్ డిన్నర్ స్లీప్ క్వాలిటీని తగ్గిస్తుంది. నిద్ర లోపం వల్ల గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ పెరిగి, లెప్టిన్ (సంతృప్తి హార్మోన్) తగ్గుతుంది. ఫలితంగా మరుసటి రోజు ఎక్కువ తినే అవకాశం పెరుగుతుంది.
*జీర్ణక్రియలో నెమ్మది: రాత్రి సమయంలో జీర్ణక్రియ వేగం తగ్గుతుంది. ఆలస్యంగా తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి.
*కొవ్వు నిల్వ పెరగడం: రాత్రి తీసుకున్న అదనపు కేలరీలను శరీరం ఎక్కువగా కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఇది అధిక బరువు లేదా ఊబకాయం సమస్యకు దారితీస్తుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గాలు
ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం రాత్రి 8-9 గంటలలోపు భోజనం పూర్తి చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డిన్నర్ తర్వాత కొద్దిసేపు నడక లేదా తేలికపాటి కదలిక ఉంటే బాగుంటుంది. అయితే భోజనం సమయం ఒక్కటే పూర్తిస్థాయి బరువు నియంత్రణకు కారణం కాదు. రోజంతా తీసుకునే ఆహార నాణ్యత, మొత్తం కేలరీలు, శారీరక వ్యాయామం, లైఫ్‌స్టైల్ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
ఆలస్యంగా తినడం వల్ల కలిగే అనర్థాలను నివారించడానికి, రాత్రి 8-9 గంటలలోపు భోజనం పూర్తిచేయడం మంచిది. కేవలం సమయం మాత్రమే కాదు, ఆహార నాణ్యత, వ్యాయామం, జీవనశైలి కూడా ఆరోగ్యానికి అత్యవసరం.


