|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సిక్కిం విలయం: లాచెన్‌లో 800 మంది పర్యాటకులు చిక్కుకుపోయారా?

Published: 05-04-2026, 11:05 PM
సిక్కిం విలయం: లాచెన్‌లో 800 మంది పర్యాటకులు చిక్కుకుపోయారా?
  • సిక్కింలో భారీగా మంచు కురుస్తుండటంతో 800 మంది పర్యాటకులు లాచెన్‌లో చిక్కుకుపోయారు.
  • లాచెన్-చుంగ్తాంగ్ మధ్య రోడ్డు కనెక్టివిటీ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
  • పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు సైన్యం, ITBP, BRO సహాయం చేస్తున్నాయి.
  • వాతావరణం మెరుగుపడిన తర్వాత పర్యాటకులను గ్యాంగ్‌టక్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సిక్కింలో పర్యటనకు వెళ్లిన పర్యాటకులు ఊహించని కష్టాల్లో చిక్కుకున్నారు. భారీగా మంచు కురుస్తుండటంతో దాదాపు 800 మంది పర్యాటకులు లాచెన్ ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

లాచెన్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులు

ఆడుతూపాడుతూ హాలిడేస్‌ను ఎంజాయ్ చేద్దామని సిక్కిం‌‌కు వెళ్లి పర్యటకులు డేంజర్‌లో పడ్డారు. భారీగా మంచు కురుస్తుండటం, రోడ్లు ఎక్కడికక్కడ బ్రేక్ అవ్వడంతో సుమారు 800 మంది పర్యాటకులు మాంగన్ జిల్లాలోని లాచెన్ (Lachen) ప్రాంతంలో చిక్కుకుపోయారు. లాచెన్ – చుంగ్తాంగ్ మధ్య ఉన్న కనెక్టివిటీ రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం.. లాచెన్-చుంగ్తాంగ్ రహదారిపై ఉన్న ‘తరుమ్ చూ’ (Tarum Chu) బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు భారీగా తెగిపోయింది. దీంతో పర్యాటక వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో పర్యాటకులు ఎక్కడికక్కడే ఉండిపోవాలని, ప్రయాణాలు చేయవద్దని మాంగన్ జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు భారత సైన్యం, ITBP, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సంయుక్తంగా రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన మంచును తొలగించి, రోడ్డును పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. వాతావరణం కాస్త మెరుగుపడితే సోమవారం ఉదయం నుంచి పర్యాటకులను గ్యాంగ్‌టక్ వైపు తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి లాచెన్‌లో ఉన్న పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని, వారికి అవసరమైన వసతి, ఆహార సౌకర్యాలను స్థానిక యంత్రాంగం పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

వాతావరణం అనుకూలిస్తేనే తరలింపు

పర్యాటకుల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాతావరణం అనుకూలించి, రోడ్డు పునరుద్ధరణ పూర్తయితే వారిని సురక్షితంగా గ్యాంగ్‌టక్‌కు తరలించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.