
నటుడు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తన ప్రియమైన పెంపుడు కుక్క మరణంపై తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.
Key Points
లావణ్య త్రిపాఠి పెంపుడు కుక్క మరణంపై విషాదం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌తో తన బాధను పంచుకున్నారు.
వరుణ్ తేజ్ భార్యగా లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇటీవల సినిమా రీఎంట్రీ ప్రకటించి, గర్భవతి అని తెలిపారు.
లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్
మెగా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరుణ్ తేజ్(Varun Tej) సతీమణి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పెట్ డాగ్ మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత ముద్దుల కూతురు నువ్వు. వీలైతే నాకు టీ తయారు చేసి ఇస్తావని నేను అందరితో చాలాసార్లు చెప్పేదాన్ని. ఎంత అందమైన హృదయం, ఎంత తెలివైనది.. అని పదే పదే అంటుంటాను. నువ్వు నిజంగా ప్రత్యేకమైనదానివి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో, నా ముద్దుల ముద్దుబిడ్డ’’ అని రాసుకొచ్చింది.
పెంపుడు కుక్క మృతిపై విషాదం
అంతేకాకుండా తన పెట్ డాగ్‌కు కొన్ని ఫొటోలు వీడియోలను షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు ఓం శాంతి అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, లావణ్య త్రిపాఠి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. మెగా హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ ఇటీవల ఓ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది కానీ ఆలోపే తాను ప్రెగ్నెంట్ కావడంతో ఆ షూటింగ్ కూడా మధ్యలోనే ఆపేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది.
నెటిజన్ల ప్రతిస్పందన
A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya)
లావణ్య త్రిపాఠి తన పెంపుడు కుక్క మృతికి తీవ్ర విషాదం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె ఎమోషనల్ పోస్ట్ నెటిజన్లను కదిలించింది.


