|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తొలి సినిమా.. లేటేస్ట్ అప్‌డేట్ ఇదే!

Published: 12-05-2025, 8:32 PM
Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తొలి సినిమా.. లేటేస్ట్ అప్‌డేట్ ఇదే!

లావణ్య త్రిపాఠి మరియు దేవ్ మోహన్ నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం డబ్బింగ్ దశలో ఉంది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న మొదటి సినిమా ఇది. భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలను చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Key Points

1

లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తొలి సినిమా 'సతీ లీలావతి'

2

వరుణ్ తేజ్ భార్యగా లావణ్య త్రిపాఠి నటన

4

వేసవి కానుకగా సినిమా విడుదలకు ప్లాన్

సతీ లీలావతి చిత్రీకరణ పూర్తి దశకు చేరుకుంది

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని  దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సతీ లీలావతి డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభమయ్యాయి.  వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి చిత్రం కావడం విశేషం.

డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం

వేసవి కానుకగా సినిమా విడుదల

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానుబంధాలను తెలియ‌జేస్తూ ఎమోష‌న‌ల్ అంశాల‌తో స‌తీ లీలావ‌తి సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభమయ్యాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. వీలైనంత త్వర‌గా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని  ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  ఈ మూవీకి  మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు.

మొత్తంగా, ‘సతీ లీలావతి’ చిత్రం లావణ్య త్రిపాఠి అభిమానులకు ఒక మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.