
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో, నటి లావణ్య త్రిపాఠి తన తీవ్ర స్పందనను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసింది. దేశానికి హాని కలిగించే వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Key Points
పహల్గామ్ ఉగ్రదాడిపై లావణ్య త్రిపాఠి తీవ్ర స్పందన.
దేశ రక్షణలో సైనికుల త్యాగాలను కొనియాడింది.
దేశంలోని శత్రువులను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
లావణ్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పహల్గామ్ ఉగ్రదాడిపై లావణ్య స్పందన
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై అగ్ర సినీతారలంతా పెద్దఎత్తున స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ మెగాస్టార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా పెద్దఎత్తను పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అంటించి తొక్కుకుంటూ వెళ్లారు.
సైనికుల త్యాగాలను కొనియాడుతూ..
అలా హిమాచల్ ప్రదేశ్‌లోనూ రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అతికించారు. అందరూ వాటిపై నడుచుకుంటూ వెళ్తంటే ఓ యువతి మాత్రం పాక్ జెండాలను తీసేందుకు యత్నించింది. ఇది చూసిన కొందరు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కాస్తా ఘాటుగా స్పందించింది.
దేశంలోని శత్రువుల శుద్ధి అవసరం
మన సైనికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతుంటే.. కొందరు మాత్రం మనదేశంలోనే ఉంటూ దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉందని రాసుకొచ్చింది. ఇలాంటి సమయంలో శత్రుదేశంపై దాడి చేయడం మాత్రమే కాదు.. మనదేశం లోపల నుంచి కూడా శుద్ధి చేయాల్సిన సమయం కూడా వచ్చిందని లావణ్య ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
లావణ్య త్రిపాఠి వ్యాఖ్యలు దేశభక్తిని, సైనికుల పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ విషయంపై ఆమె స్పష్టమైన అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


