|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ఇంట కవలలు.. లావణ్య త్రిపాఠి రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు!

Published: 01-02-2026, 6:35 AM
మెగా ఇంట కవలలు.. లావణ్య త్రిపాఠి రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు!
  • ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించిన సందర్భంగా మెగా ఫ్యామిలీలో సంబరాలు.
  • ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు.
  • లావణ్య త్రిపాఠి తన పోస్ట్‌లో కవలలకు స్వాగతం పలుకుతూ క్లీంకార గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • క్లీంకార ఇప్పుడు అధికారికంగా ‘బిగ్ సిస్టర్’ హోదాకు ప్రమోట్ అయింది అని లావణ్య పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇంట కవల పిల్లలు జన్మించడంతో ఆనందం వెల్లివిరుస్తోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో ఏముందో చూద్దాం.

మెగా ట్విన్స్ రాకతో సంబరాలు

Lavanya Tripathi: మెగా కపుల్ ఉపాసన (Upasana), రామ్ చరణ్ (Ram Charan) దంపతులకు మెగా ట్విన్స్ (Mega Twins) జన్మించడంతో మెగా ఫ్యామిలీలో ఓ రేంజ్‌లో సంబరాలు (Mega Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా అసలు భూమి మీద ఆగడం లేదు. ఎందుకంటే, మెగా ఫ్యామిలీనే కాదు, మెగా అభిమానులందరూ చిరంజీవి (Megastar Chiranjeevi)కి మనవడు పుట్టాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. చిరంజీవి కూడా ఆ మధ్య ఓ ఈవెంట్‌లో ఇంటి నిండా ఆడపిల్లలు ఉండటంతో, ఇంట్లో ఉన్నానా? హాస్టల్‌లో ఉన్నానో? అర్థం కావడం లేదంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఈసారైనా చరణ్‌ని ఓ బాబుని ఇవ్వమని అడుగుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ తర్వాత పెద్ద కాంట్రవర్సీ కూడా నడిచిందనుకోండి. అదే వేరే విషయం. ఆ వేడుకలో చిరు కోరుకున్నట్లుగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి వారసుడు దిగాడు. అందుకే ఆ ఫ్యామిలీ అంతా పట్టరానంత ఆనందంలో మునిగిపోయింది.

ఇక మెగా ట్విన్స్ ఎంట్రీని పురస్కరించుకుని రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్ కో స్టార్, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ట్విన్స్‌కు స్వాగతం పలికారు. అదే సమయంలో మెగా కపుల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా మరో మెగా కోడలు, వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఆమె ట్విన్స్‌కు స్వాగతం పలుకుతూనే.. రామ్ చరణ్, ఉపాసన దంపతుల మొదటి కుమార్తె క్లీంకారను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లావణ్య త్రిపాఠి తనదైన శైలిలో అభినందనలు తెలుపుతూ పెట్టిన పోస్ట్ అందరి మనసులను గెలుచుకుంటోంది. ఇంతకీ లావణ్య త్రిపాఠి ఏం పోస్ట్ చేసిందంటే..

లావణ్య త్రిపాఠి వైరల్ పోస్ట్

‘‘హాయ్ టినీ ట్విన్స్.. ఈ ప్రపంచంలోకి మీకు స్వాగతం! మీరు పుట్టకముందే ఎంతో ప్రేమను సొంతం చేసుకున్నారు. క్లీంకారకు అభినందనలు. తను ఇప్పుడు అధికారికంగా ‘బిగ్ సిస్టర్’ హోదాకు ప్రమోట్ అయ్యింది’’ అంటూ లావణ్య సరదాగా పేర్కొన్నారు. అంతేకాదు, తనకు, వరుణ్‌కు పుట్టిన వాయువ్ తేజ్‌ని కూడా ఇంతలో కలిపి క్యూట్‌గా స్పందించారు లావణ్య. ‘‘మీ కజిన్ వాయువ్ నుంచి మీకు బోలెడంత లవ్ అండ్ హగ్స్.. మీతో కలిసి ఆడుకోవడానికి, మీతో పాటే పెరగడానికి వాయువ్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు’’ అని తన కుమారుని తరపున కూడా లావణ్య శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తంగా చూస్తే.. ఉపాసన, చరణ్‌లకు ఈ ‘డబుల్ బ్లెస్సింగ్’ దక్కినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచిన లావణ్య త్రిపాఠి పోస్ట్ చూసి మెగాభిమానులు ఫిదా అవుతున్నారు. మెగా వారసులందరూ కలిసి ఉన్న ఫోటోల కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్లు లావణ్య పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు.

Hi tiny twins 💫💙💖 Welcome to this world, you’re already soo loved!

Big hugs to Kaara, now officially promoted to big sister 🌸

A huge congratulations to @upasanakonidela & @AlwaysRamCharan on this double blessing 🤍✨

క్లీంకారకు బిగ్ సిస్టర్ హోదా

Love, cuddles, and lots of fun coming your way from…

— Lavanya konidela tripathi (@Itslavanya) February 1, 2026

మొత్తానికి మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. లావణ్య త్రిపాఠి తనదైన శైలిలో స్పందిస్తూ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామ్ చరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.