
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవిపై జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో దుమారం!
- జర్నలిస్ట్ కామెంట్ పై మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఘాటు రిప్లైతో దిమ్మతిరిగే కౌంటర్!
- చిరంజీవి వ్యక్తిత్వాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్!
- మెగా ఫ్యామిలీలో మనవడి రాకతో సంబరాలు, జర్నలిస్ట్ వ్యాఖ్యలు బాధించాయని లావణ్య ఆవేదన!
మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక జర్నలిస్ట్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి గట్టిగా బదులిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!
చిరంజీవిపై జర్నలిస్ట్ దారుణ వ్యాఖ్యలు
మెగా స్టార్ చిరంజీవికి పరిచయం అవసరం లేదు. ఎన్నో ఎళ్లుగా టాలీవుడ్ లో అద్భుతమైన సినిమాలు చేసి.. కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన కుమారుడు రామ్ చరణ్.. చిరంజీవి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అయితే.. రామ్ చరణ్ కి పెళ్లైన పదేళ్లకు కూతురు పుట్టింది. అంతేకాదు.. చిరంజీవికి.. కూతుళ్లకు కూడా అందరూ కూతుర్లే ఉన్నారు. దీంతో.. తన లెగసీని కంటిన్యూ చేయడానికి మనవడు లేడు అనే బాధను ఒకసారి ఆయన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉంటే.. అందరూ ఆడ పిల్లలే అని.. తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.
చిరు మాత్రమే కాదు.. ఆయనకు వారసుడు రావాలి అని..అభిమానులు కూడా ఎంతో కోరుకున్నారు. అందరి కోరికలు నిజమై.. రీసెంట్ గా రామ్ చరణ్ కి ఒక కొడుకు పుట్టాడు. దీంతో.. మెగా ఫ్యామిలీలో అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు.అయితే..ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ దుమారం రేపింది.
లావణ్య త్రిపాఠి అదిరిపోయే కౌంటర్
హరి చరణ్ పుడిపెద్ది అనే వ్యక్తి ట్విట్టర్ లో.. ‘ 2026లో కూడా మగ బిడ్డ కోసం ఈ పాకులాట చూడటం చాలా నిరాశ కలిగిస్తోంది. రామ్ చరణ్ మొదటి కూతరు క్లిన్ కారా పుట్టినప్పుడు ఇంత గ్రాండ్ వెల్కమ్ లభించలేదు, ఇది ఒక రకమైన ‘ సిక్ మెంటాలిటీ’ కి నిదర్శనం’ అని కామెంట్ చేశారు. కాగా… ఈ ట్వీట్ కి.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఫైర్
ఈ వ్యాఖ్యలపై లావణ్య త్రిపాఠి స్పందిస్తూ, చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. ఒక అందమైన , సంతోషకరమైన క్షణాన్ని ఇలా అసహ్యకరంగా మార్చడం చాలా తక్కువ స్థాయి ఆలోచన అని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి గారు తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాల్ని ఎంత గౌరవంగా, ప్రేమగా చూసుకుంటారో మీకు తెలియదు. ఆయన చేసే పనిలో కనీసం 1% కూడా చేయలేని వారు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదని, తెలియని వ్యక్తుల గురించి కామెంట్స్ చేయకపోవడం మంచిదని ఆమె చురకలు వేశారు. ప్రస్తుతం లావణ్య చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
లావణ్య త్రిపాఠి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగా అభిమానులు లావణ్యకు మద్దతు తెలుపుతున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


