|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లావణ్య త్రిపాఠి ఫైర్: మా కుటుంబంపై దాడి చేస్తే సహించేది లేదు! కొణిదెల వారి కోడలి స్ట్రాంగ్ వార్నింగ్!

Published: 12-02-2026, 3:36 AM
లావణ్య త్రిపాఠి ఫైర్: మా కుటుంబంపై దాడి చేస్తే సహించేది లేదు! కొణిదెల వారి కోడలి స్ట్రాంగ్ వార్నింగ్!
  • సతి లీలావతి ప్రమోషన్స్‌లో లావణ్య త్రిపాఠి బిజీ
  • మెగా కుటుంబంపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై లావణ్య ఆగ్రహం
  • చిరంజీవి వ్యాఖ్యలపై విమర్శలకు లావణ్య కౌంటర్
  • కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై సీరియస్ అయ్యారు. చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆమె ఘాటుగా స్పందించారు.

మెగా ఫ్యామిలీపై ట్రోల్స్: లావణ్య రియాక్షన్

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సతి లీలావతి(sathi leelavathi ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాఠి మెగా కుటుంబం గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ఘాటుగా స్పందించారు. ఇటీవల మెగా హీరో రామ్ చరణ్(Ramcharan) ఉపాసన (Upasana)దంపతులకు కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. ఇక ఈ కవల పిల్లలలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా కొంతమంది మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

గతంలో ఒక కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ తనకు ఇంట్లో ఉంటే ఏదో గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ గా ఉన్నాను అనే భావన ఉంటుందని మా లెగసిని కంటిన్యూ చేయడానికి ఒక అబ్బాయి పుడితే బాగుండు అంటూ ఈయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేశారు చిరంజీవికి అమ్మాయిలు అంటే చిన్న చూపు అంటూ విమర్శలు చేసిన నేపథ్యంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి రంగంలోకి దిగి గతంలో సోషల్ మీడియా వేదికగా ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

చిరంజీవిపై విమర్శలు: లావణ్య కౌంటర్

సతీ లీలావతి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రిపోర్టర్స్ నుంచి ఈ ప్రశ్న ఎదురవడంతో ఈమె మాట్లాడుతూ.. కవల పిల్లలు జన్మించడంతో మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాము. మా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే అసలు ఊరుకోను. చిరంజీవి గారు మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తారు, ఆయన ఎలా ఉంటారు అనేది మాకు తెలుసు. మా కుటుంబం గురించి తెలియకుండా ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడటం తప్పు ఈ ఆనందమైనా క్షణాలను అసహ్యంగా మార్చకండి అంటూ ఈమె తనదైన స్టైల్ లోనే మెగా ఫ్యామిలీ పై విమర్శలు చేసే వారికి వార్నింగ్ ఇచ్చారు.

దేవ్ మోహన్, లావణ్య త్రిపాటి..

ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చిన మెగా కోడలు

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. మెగా కోడలు అంటే ఇలాగే ఉండాలి.. కుటుంబం పై ఈగ కూడా వాళ్ళనివ్వలేదు అంటూ లావణ్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక లావణ్య సతీ లీలావతి సినిమా విషయానికి వస్తే దేవ్ మోహన్ లావణ్య త్రిపాటి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా లావణ్య పలు వ్యక్తిగత కారణాలవల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ఇక మార్చి ఆరో తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టారు ఇక లావణ్య కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు.

లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు లావణ్యకు మద్దతు తెలుపుతూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.