
📌 Key Points
- నానిని ‘పని రాక్షసుడు’గా అభివర్ణించిన జిమ్ ట్రైనర్ విశ్వ భరత్.
- సోషల్ మీడియాలో నానిపై వచ్చే ట్రోల్స్ చూస్తే కోపం వస్తుందని వెల్లడి.
- ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కోసం నాని అంకితభావం, వర్కౌట్స్ గురించి వివరణ.
- నానితో మూడేళ్లుగా ట్రావెల్ చేస్తున్నానని, ఆయన వ్యక్తిత్వం గొప్పదని ట్రైనర్ వ్యాఖ్య.
నాచురల్ స్టార్ నాని పనితీరుపై ఆయన జిమ్ ట్రైనర్ విశ్వ భరత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నానిని ‘పని రాక్షసుడు’గా అభివర్ణించిన ఆయన, సోషల్ మీడియాలో నానిపై వచ్చే ట్రోల్స్ చూస్తే తనకు కోపమొస్తుందని తెలిపారు. నాని అంకితభావం గురించి వివరించారు.
నాని ‘పని రాక్షసుడు’: జిమ్ ట్రైనర్ ప్రశంసలు
Actor Nani: నాచురల్ స్టార్ నాని ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. డైరెక్టర్ గా మొదలైన ఈయన ప్రయాణం ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా, నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమా పనులలో నాని ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నాని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.
నాని జడల్ అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ పాత్రలో నటించడం కోసం నాని ఎంతలా కష్టపడ్డారనే విషయాల గురించి తాజాగా ఈయన జిమ్ ట్రైనర్ విశ్వ భరత్(Vishwa Bharat) చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జిమ్ ట్రైనర్ విశ్వ భరత్ నాని గురించి మాట్లాడుతూ హిట్ 2 సినిమా సమయం నుంచి నానితో తనకు చాలా మంచి పరిచయం ఏర్పడిందని తెలిపారు. నానితో తాను గత మూడు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాను. సినిమా కోసం కష్టపడటంలో నాని పని రాక్షసుడు అని విశ్వభరత్ తెలిపారు.
ఇక నాని చాలా మంచి వ్యక్తిత్వం కల మనిషి ఇలాంటి వ్యక్తి గురించి కొన్ని సార్లు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి అలాంటి నెగటివ్ కామెంట్ చూసినప్పుడు నాకు టెంపర్ లేచిపోతుందని తెలియజేశారు. నేను నానితో చాలా క్లోజ్ గా ఉంటాను అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు నాకు తెలుస్తాయి. అలాంటి వ్యక్తి గురించి నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పుడు కోపం వస్తుందని తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయం 5 గంటలకు లేచి ఆరుగంట సెట్ లో ఉంటారు. సాయంత్రం ఏడు గంటల వరకు షూటింగ్ జరుగుతుంది.
ట్రోల్స్‌పై జిమ్ ట్రైనర్ ఆగ్రహం
pic.twitter.com/kaP8Qe036a
— VVG Videos (@VVGVideos) May 8, 2026
‘ది ప్యారడైజ్’ కోసం నాని కష్టం
ఇలా పగలంతా రోప్స్ కట్టుకొని షూటింగ్ చేసినప్పటికీ ఆయన అలసిపోకుండా సాయంత్రం కచ్చితంగా వర్క్ అవుట్ చేస్తానని తన నుంచి కాల్ వస్తుందని, ఫిట్నెస్ విషయంలో నాని అంత పర్టికులర్ గా ఉంటారనే విషయాన్ని తాజాగా విశ్వభరత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను అలసిపోయాను చేయనని నాని చెప్పొచ్చు కానీ ఆయన అలా చెప్పి తప్పించుకోరు అంటూ నాని పనితనం గురించి విశ్వభరత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టు 21వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ నటిస్తున్నారు.
నాని అంకితభావం, కఠోర శ్రమను జిమ్ ట్రైనర్ విశ్వ భరత్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన వ్యక్తిత్వంపై వచ్చే అనవసర ట్రోల్స్ పట్ల ట్రైనర్ ఆగ్రహం వ్యక్తం చేయడం నాని పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది.

