|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Laya: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. కూతురికి లయ బర్త్‌డే విషెస్‌

Published: 26-06-2025, 2:20 AM
Laya: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. కూతురికి లయ బర్త్‌డే విషెస్‌

బాలనటిగా, హీరోయిన్ గా సినీ రంగంలో రాణించిన లయ, కొంతకాలం విరామం తర్వాత ‘తమ్ముడు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె కూతురు పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది.

Key Points

1

లయ తమ్ముడు సినిమాతో రీఎంట్రీ చేస్తోంది.

2

ఆమె కూతురు శ్లోక పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

4

శ్లోక అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

లయ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా రాణించింది లయ (Actress Laya Gorty ) . శివరామరాజు, నీ ప్రేమకై, ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా.. ఇలా బోలెడు సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. కొన్నేండ్ల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికాలో సెటిలైన లయ తమ్ముడు చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.

తమ్ముడుతో రీఎంట్రీ నితిన్‌ ప్రధాన పాత్రలో నటించిన తమ్ముడు సినిమా లో లయ అక్కగా నటించింది. వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసికా విజయన్, బేబీ శ్రీరామ్‌ కీలక పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 4న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు లయ సినిమాలకు దూరంగా ఉందే కుటుంబం కోసం! అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంది. సరైన సమయం వచ్చేదాకా ఆగి ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయింది. తాజాగా లయ ఇంట గ్రాండ్‌ ఫంక్షన్‌ జరిగింది.

కూతురు శ్లోక పుట్టినరోజు వేడుకలు

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా శ్లోక.. ఆమె కూతురు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను లయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. హ్యాపీ బర్త్‌డే మై శ్లోక ప్రిన్సెస్‌.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా లిటిల్‌ సన్‌షైన్‌కు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని క్యాప్షన్‌ జోడించింది. ఇది చూసిన అభిమానులు లయ కూతురికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. శ్లోక.. అమర్‌ అక్బర్‌ ఆంటోని మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. అఖండ 2లోనూ శ్లోక భాగమైనట్లు ఆమధ్య ఓ రూమర్‌ తెగ వైరలయింది.

సోషల్ మీడియాలో లయ పోస్ట్

లయ తన కూతురితో ఉన్న అనుబంధాన్ని, ఆమె సినిమా రంగంలోని తిరిగి రాకను ఈ వార్త తెలియజేస్తుంది. భవిష్యత్తులో లయ మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.