|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Laya : ‘లయ’ రీ ఎంట్రీ.. ఇన్నాళ్లు అమెరికాలో ఏం చేసేదో తెలుసా..? అన్ని డబ్బులు వదిలేసుకొని సినిమా కోసం..

Published: 26-06-2025, 4:19 AM
Laya : ‘లయ’ రీ ఎంట్రీ.. ఇన్నాళ్లు అమెరికాలో ఏం చేసేదో తెలుసా..? అన్ని డబ్బులు వదిలేసుకొని సినిమా కోసం..

ఒకప్పుడు తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన లయ, పెళ్లయ్యాక అమెరికాలో సెటిల్ అయింది. ఇప్పుడు నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న లయ, తన ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని సినిమా కోసం వచ్చిందని తెలిపింది.

Key Points

1

లయ అమెరికాలో ఉన్న ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది.

2

లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, తమ్ముడు సినిమా కోసం భారీగా సంపాదించే అవకాశాన్ని త్యాగం చేసింది.

4

మంచి పాత్రలు వస్తే సినిమాలు కొనసాగిస్తుందని, లేకపోతే అమెరికాకు తిరిగి వెళుతుందని తెలిపింది.

లయ యొక్క సినిమా ప్రస్థానం

Laya : ఒకప్పుడు స్వయంవరం, ప్రేమించు, మనోహరం, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, స్వరాభిషేకం.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తెలుగు నటి లయ. కానీ పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిపొయింది. పెళ్లి తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా ఇప్పుడు నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తమ్ముడు సినిమాలో నితిన్ కి అక్క పాత్రలో లయ నటిస్తుంది.

అమెరికా నుంచి వచ్చి ఇక్కడే షూటింగ్స్ చేసి, ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. తాజాగా లయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. లయ MCA చదివింది. అప్పట్లో సినిమాలు చేస్తూనే చదువుకుంది. అమెరికాకు వెళ్ళిపోయాక లయ ఐటీ ఫీల్డ్ లో జాబ్ చేసింది. ఇక అమెరికాలో ఐటీ జాబ్ అంటే వేతనం కూడా భారీగా ఉంటుందని తెలిసిందే.

అమెరికాలోని ఐటీ ఉద్యోగం

తమ్ముడు కోసం రీ ఎంట్రీ ముందు వరకు కూడా లయ ఐటీ జాబ్ చేసిందట. లక్షల్లో జీతం వచ్చేదని, కానీ తమ్ముడు సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత జాబ్ వదిలేసుకొని మరీ ఇక్కడికి వచ్చానని, నాకు సినిమా రెమ్యునరేషన్ కంటే కూడా ఐటీ జాబ్ లోనే ఎక్కువ డబ్బులు వస్తాయని, మూవీ యూనిట్ కూడా మీకు ఐటీ జాబ్ లో వచ్చేంత ఇవ్వలేమని చెప్పారని, అయినా సినిమా మీద ఇష్టంతో చాన్నాళ్లకు ఒక మంచి పాత్ర వచ్చిందని జాబ్ వదిలేసుకొని వచ్చానని తెలిపింది.

సినిమా కోసం ఉద్యోగం వదులుకోవడం

మంచి పాత్రలు వస్తే సినిమాలు కంటిన్యూ చేస్తానని లేకపోతే మళ్ళీ అమెరికా వెళ్లి ఐటీ జాబ్ చేసుకుంటాను అని చెప్పింది. నెలకు లక్షలు సంపాదించే ఐటీ జాబ్ వదులుకొని సినిమా కోసం, రీ ఎంట్రీ కోసం వచ్చిందంటే గ్రేట్ అని లయని అభినందిస్తున్నారు. ఇక లయ భర్త అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయ్యారు. లయకు ఒక పాప, బాబు ఉన్నారు. ఇద్దరూ అమెరికాలోనే చదువుకుంటున్నారు.

లయ తన నిర్ణయంతో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సినిమాపై ఉన్న అభిరుచి, తన కుటుంబం మద్దతుతో ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రల్లో లయను చూడాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.