|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్ బద్దల్! ‘లెనిన్’ కలెక్షన్ల సునామీ.. నాగవంశీ షాకింగ్ ఎమోషనల్ పోస్ట్!

Published: 13-07-2026, 3:22 AM
బాక్సాఫీస్ బద్దల్! 'లెనిన్' కలెక్షన్ల సునామీ.. నాగవంశీ షాకింగ్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ! అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి. మూడు రోజుల్లోనే రికార్డులు తిరగరాస్తూ, నిర్మాత నాగవంశీ ఎమోషనల్ పోస్ట్‌తో మరింత హైప్ పెంచారు. ఈ సినిమా విజయం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి?

Key Points

1

'లెనిన్' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు! బాక్సాఫీస్ షేక్.

2

అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్! అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

4

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో లాభాలు. చిత్ర బృందానికి భారీ సక్సెస్.

బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సునామీ!

అక్కినేని అఖిల్ చాలా కాలం తర్వాత ‘లెనిన్’ సినిమాతో వచ్చి బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. కిషోరు అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియడ్ రూరల్ రివెంజ్ డ్రామా భారీ అంచనాల మధ్య థియేటర్స్‌కి వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. ఈ సినిమా ఇందులో హీరో,హీరోయిన్‌గా నటించిన అఖిల్, భాగ్యశ్రీ బోర్సే కెరిర్‌కు పెద్ద ప్లస్‌గా మారింది. ఇద్దరు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలలోనే లెనిన్ ఓ మైలురాయిగా నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 61.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తోంది. ఈ విషయాన్ని నాగవంశీ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. “సంవత్సరంన్నర క్రితం ‘లెనిన్’ సినిమా కోసం మనం ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేతులు కలిపినప్పుడు మా లక్ష్యం ఒక్కటే. అఖిల్‌కు ఒక ఘనమైన బ్లాక్‌బస్టర్ హిట్ అందించడం, ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరూ గర్వపడేలా, సంతోషపడేలా చేయడం” అని ఆయన పేర్కొన్నారు.

సినిమా బిజినెస్ గురించి చెబుతూ.. “కొన్ని వారాల క్రితం మేము థియేట్రికల్ బిజినెస్‌ను ఖరారు చేస్తున్నప్పుడు, నాగార్జున గారు, నేను కలిసి ప్రతి ప్రాంతంలోనూ సినిమా ధరను చాలా బాధ్యతాయుతంగా నిర్ణయించాలని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాము. ‘లెనిన్’ సినిమాను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఫస్ట్ వీకెండ్ నుంచే లాభాలు చూస్తూ విజయాన్ని జరుపుకోవాలనే విషయంలో మేమిద్దరం గట్టిగా నిలబడ్డాము. ఆ నమ్మకమే మేము తీసుకున్న ప్రతి నిర్ణయానికి మార్గదర్శకమైంది” అని తెలిపారు. చివరగా డిస్ట్రిబ్యూటర్ల సంతోషంపై స్పందిస్తూ.. “ఈ రోజు మొదటి వారాంతం ముగిసేలోపే మా డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడం, థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులతో ఎగ్జిబిటర్లు విజయాన్ని జరుపుకోవడం చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మాకు విజయం అంటే కేవలం నంబర్లు మాత్రమే కాదు, అందరి ముఖాల్లో పంచుకున్న ఆనందం. ‘లెనిన్’ సినిమాను నిర్మించడంలో మా ఉద్దేశ్యం నెరవేరింది. ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమతో ఆదరించిన ప్రేక్షకులకు, మమ్మల్ని నమ్మిన పంపిణీదారులకు, భాగస్వాములకు ధన్యవాదాలు” అంటూ నాగవంశీ రాసుకొచ్చారు. అంతేకాకుండా అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడంటూ ఒక క్రేజీ పోస్టర్‌ను కూడా ఆయన షేర్ చేశారు.

నాగవంశీ ఎమోషనల్ పోస్ట్: విజయం అంటే నంబర్లు మాత్రమే కాదు!

అఖిల్ కెరీర్‌కు బిగ్గెస్ట్ హిట్!

లెనిన్’ సినిమా సాధిస్తున్న ఈ అద్భుతమైన విజయం టాలీవుడ్‌లో కొత్త చరిత్రను సృష్టిస్తోంది. అఖిల్ కెరీర్‌కు ఇది ఒక మైలురాయి. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.