
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (lik) దీపావళి బరి నుంచి తప్పుకుంది. మరో సినిమాతో క్లాష్ లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని డిసెంబర్ 18గా ఖరారు చేశారు.
Key Points
ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (lik) దీపావళి రేసు నుంచి తప్పుకుంది.
డిసెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రదీప్ మరో చిత్రం 'డ్యూడ్'తో క్లాష్ నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
నయనతార, లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు.
‘lik’ వాయిదా వెనుక కారణం
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’ సినిమాతో హిట్ అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీ అయిపోయాడు. త్వరలో ప్రదీప్ డ్యూడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు దీపావళి బరిలో ఉన్నాయి. రెండు ఒకేసారి రిలీజ్ కాబోతుండటంతో.. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీని వాయిదా వేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు ఒక రోజు గ్యాప్‌తో విడుదల చేయడం చిత్రబృందానికి ఇష్టం లేకపొవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త విడుదల తేదీ, చిత్రబృందం ప్రకటన
తాజాగా, ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఈ రెండు సినిమాలు ఒకే ట్రాక్‌పై ఉన్న రెండు రైళ్లలాగే ఎదురెదురుగా ఢీకొనడం ఎవరికీ ఉపయోగపడదు. మా ప్రియమైన హీరో ప్రదీప్ రంగనాథన్ పట్ల నిజమైన ప్రేమతో ఈ రెండు చిత్రాల వెనుక ఉన్న కృషిని గౌరవిస్తూ.. మేము lik విడుదల వాయిదా వేస్తున్నాం. ఈ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ చేయాలని ఆలోచనాత్మకంగా నిర్ణయించుకున్నాము. మైత్రీ మూవీస్ సమన్వయం చేసుకోవడానికి మేము ఎంత ప్రయత్నించినా.. మాకు ఒక విషయంపై ఒక అభిప్రాయం రాలేకపోయాము. రెండు సినిమాలు ఒకదానికొకటి పోటీ పడకుండా.. దేనికదే ప్రకాశించేలా వాయిదా వేయడం తెలివైన పని అని మేము నమ్ముతున్నాము.
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ నటీనటులు, సాంకేతిక వర్గం
ప్రదీప్ రంగనాథన్, డ్యూడ్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంతోషకరమైన దీపావళికి ఘన విజయం సాధించాలని కోరుతున్నాము’’ అని రాసుకొచ్చారు. కాగా, ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు.ఈ రొమాంటిక్ కామెడీ మూవీని స్టార్ హీరోయిన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య, యోగిబాబె, గౌరీ జీ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార, లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.
‘lik’ చిత్రాన్ని వాయిదా వేయడం ద్వారా, మేకర్స్ ఇరు చిత్రాలకు తగిన గౌరవం ఇవ్వాలనుకున్నారు. డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమైన ‘lik’ ప్రేక్షకులను అలరిస్తుందని, విజయం సాధిస్తుందని ఆశిద్దాం.


