
లిటిల్ హార్ట్స్ సినిమా 35 రోజుల్లోనే పూర్తయింది. కొత్త దర్శకుడు అనే విషయాన్ని చాలామంది నమ్మలేదు. హీరోయిన్ శివాని నాగరం తన అనుభవాలను పంచుకుంది. సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది.
Key Points
లిటిల్ హార్ట్స్ సినిమా 35 రోజుల్లో పూర్తయింది.
కొత్త దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.
హీరోయిన్ శివాని నాగరం సినిమా విజయం గురించి మాట్లాడారు.
యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అవుతోంది.
లిటిల్ హార్ట్స్ సినిమా విజయం
ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో ఫేమ్ అయిన మౌళి తనూజ్ హీరోగా నటించిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ సినిమాలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బ్యూటీ శివాని నాగరం హీరోయిన్‌గా చేసింది. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్ సినిమాకు దర్శకత్వం వహించారు.
లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్ రోజు నుంచి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది లిటిల్ హార్ట్స్ సినిమా. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా లిటిల్ హార్ట్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ శివాని నాగరం ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది.
హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్ సినిమాను మిగతా మీడియాతో పాటు మీమర్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. మా సినిమాను ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చూశామని చెబుతుండటం హ్యాపీగా ఉంది. రిలీజ్ ముందు మేము చెప్పినట్లే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతోంది” అని తెలిపింది.
35 రోజుల్లో షూటింగ్ పూర్తి
“నేను కాత్యాయని క్యారెక్టర్‌లో బాగుంటానని అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మార్తాండ్‌కు థ్యాంక్స్. 35 రోజుల్లోనే ఈ సినిమా షూట్ చేశాం. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ చేశారంటే చాలామంది నమ్మడం లేదు. మార్తాండ్ అంత బాగా రూపొందించాడు. మా సపోర్ట్ సిస్టమ్ ఈటీవీ విన్ సాయికృష్ణ, నితిన్. అలాగే డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ నందిపాటి, బన్నీవాస్ గారికి థ్యాంక్స్” అని హీరోయిన్ శివాని నాగరం పేర్కొంది.
తన కామెడీ టైమింగ్‌తో చాలా పాపులర్ అయిన నటుడు జయకృష్ణ మాట్లాడుతూ.. “ఫస్ట్ ఆడిషన్స్‌లో నేను మౌళి ఫ్రెండ్ మధు క్యారెక్టర్ కోసం ఇంప్రెస్ చేయలేకపోయా. మరికొన్ని సీన్స్ చేశాక ఆ క్యారెక్టర్‌కు నేనే కరెక్ట్ అని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. లిటిల్ హార్ట్స్ తర్వాత నీకు మంచి పేరొస్తుందని ఈటీవీ విన్ సాయికృష్ణ అన్న, నితిన్ అన్న చెప్పేవారు. వారు చెప్పినట్లే నాకు మంచి పేరు దక్కుతోంది” అని అన్నారు.
శివాని నాగరం, సాయి మార్తాండ్ కామెంట్స్
ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ.. “మంచి కంటెంట్‌తో సినిమా చేస్తే తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు లిటిల్ హార్ట్స్ సక్సెస్‌తో మరోసారి ప్రూవ్ చేశారు. ఈ చిత్రానికి మీడియా ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం” అని అన్నారు.
“90 మిడిల్ క్లాస్ బయోపిక్ తీసినప్పుడు గానీ లిటిల్ హార్ట్స్ టైమ్‌లో గానీ కొందరు నిరుత్సాహపరిచారు. ఈ కంటెంట్‌ను థియేటర్స్‌లో చూస్తారా అన్నారు. కానీ అలాంటి వారికి మా మూవీ సక్సెస్ ఆన్సర్ ఇచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్ చేసేందుకు ధైర్యాన్ని ఇచ్చింది” అని ఈటీవీ విన్ ఓటీటీ హెడ్ సాయికృష్ణ చెప్పారు.
లిటిల్ హార్ట్స్ సినిమా యొక్క విజయం, కొత్త దర్శకుడి కృషి, మరియు నటీనటుల అద్భుతమైన నటనను ఈ కథనం హైలైట్ చేస్తుంది. సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని తెలుస్తోంది.


