|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lock Down Postponed: అఖండ 2 ఖాతాలో మరో మూవీ… అనుపమ సినిమా వాయిదా

Published: 11-12-2025, 5:08 AM
Lock Down Postponed: అఖండ 2 ఖాతాలో మరో మూవీ… అనుపమ సినిమా వాయిదా
  • అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘లాక్ డౌన్’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది.
  • డిసెంబర్ 12న అఖండ 2 విడుదల కారణంగా ‘లాక్ డౌన్’ చిత్రాన్ని వాయిదా వేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.
  • ఈ సినిమా కరోనా సమయంలో ఏర్పడిన లాక్ డౌన్ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కింది.
  • నిర్మాతలు లైకా ప్రొడక్షన్ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లాక్ డౌన్’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం, అదే రోజున ‘అఖండ 2’ విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

‘లాక్ డౌన్’ వాయిదాకు ప్రధాన కారణం

Lock Down Post poned: అనుపమ పరమేశ్వరన్ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఈమె ఐదు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మరో సినిమా ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వర ప్రధాన పాత్రలో “లాక్ డౌన్” (Lock Down)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా పలు సందర్భాలలో వాయిదా పడటంతో డిసెంబర్ 12వ తేదీ విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

తాజాగా ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ కూడా వాయిదా పడినట్లు నిర్మాతలు లైకా ప్రొడక్షన్ వారు అధికారకంగా వెల్లడించారు. డైరెక్టర్ ఏ ఆర్ జీవా దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా కరోనా సమయంలో ఏర్పడిన లాక్ డౌన్ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. డిసెంబర్ ఐదవ తేదీ ఈ సినిమా విడుదల కావాల్సిందిగా అప్పుడు అఖండ 2 విడుదల కావడంతో వాయిదా వేస్తూ 12వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఊహించని విధంగా అఖండ 2 డిసెంబర్ 5న వాయిదా పడుతూ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ విషయం గురించి చిత్ర నిర్మాతలు అధికారక ప్రకటన వెల్లడించారు.

కొన్ని పరిస్థితుల కారణంగా లాక్ డౌన్ సినిమాని వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమా విడుదల కోసం అందరూ ఎంతలా ఎదురు చూశారో మేము అర్థం చేసుకోగలము అయితే ఈ సినిమా వాయిదా పడటంతో ప్రేక్షకులకు, థియేటర్ భాగస్వాములకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది కలుగుతుందని అందుకు తాము విచారణ వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

డిసెంబర్ 12న అఖండ 2 విడుదల

#Lockdown has been postponed. The new release date will be shared soon. 🗓️ #LockdownInCinemasSoon pic.twitter.com/wKPkBQF9UE

— Lyca Productions (@LycaProductions) December 11, 2025

నిర్మాతల నుండి అధికారిక ప్రకటన

లాక్ డౌన్ సినిమాని సాధ్యమైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమా రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వాయిదా పడటం గమనార్హం. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఇక అనుపమ పరమేశ్వరన్ ఇటీవల బైసన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత లాక్ డౌన్ రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వాయిదా పడిన ‘లాక్ డౌన్’ చిత్రం పట్ల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మాతలు త్వరలోనే కొత్త తేదీని ప్రకటించి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.