|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాన్దార్! ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎక్కడో తెలుసా?

Published: 04-04-2026, 7:05 AM
షాన్దార్! 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎక్కడో తెలుసా?
  • ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ!
  • ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్!
  • ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం!
  • ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’!

ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా వస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మరియు వేదికను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో జోష్ నెలకొంది.

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ?

వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ తాజాగా lik (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) చిత్రంలో హీరోగా నటించాడు. ఇందులో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించగా, విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన తేదీ, వేదికను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5, 2026న మధ్యాహ్నం 3 గంటల నుండి హైదరాబాదులోని పార్క్ హయత్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు జనాలను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

హీరో హీరోయిన్లు ఎవరు?

సినిమా విడుదల ఎప్పుడు?

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.