|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో తెలుగులో వచ్చిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘మామన్’.. కొత్తగా పెళ్లయిన జంట మధ్యలో మేనల్లుడు.. ఎమోషనల్ కామెడీ డ్రామా

Published: 27-08-2025, 1:36 PM
ఓటీటీలో తెలుగులో వచ్చిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘మామన్’.. కొత్తగా పెళ్లయిన జంట మధ్యలో మేనల్లుడు.. ఎమోషనల్ కామెడీ డ్రామా

తమిళ సూపర్ హిట్ చిత్రం ‘మామన్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా అందుబాటులో ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట జీవితంలో మేనల్లుడు ఎలాంటి మార్పులు తీసుకువస్తాడో చూడండి.

Key Points

1

తమిళ సూపర్ హిట్ ‘మామన్’ తెలుగులో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

2

కొత్తగా పెళ్ళైన జంట జీవితంలో మేనల్లుడి ప్రభావం చూపించే కథ.

4

సూరి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు.

‘మామన్’ తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో

తమిళ సూపర్ హిట్ కామెడీ ఎమోషనల్ డ్రామా ‘మామన్’ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇవాళ (ఆగస్టు 27) నుంచి ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా ఈ తమిళ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ చేశారు.

తమిళ కామెడీ ఎమోషనల్ మూవీ మామన్ ఇప్పుడు తెలుగులో ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా బుధవారం నుంచి జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్ని రోజులు తమిళంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ ఆడియన్స్ ను అలరిస్తోంది.

కొత్తగా పెళ్లైన జంట, మేనల్లుడు మరియు కుటుంబ కథ

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఫ్యామిలీ కామెడీ డ్రామా మే 16, 2025న థియేటర్లలో రిలీజైంది. ఆగస్టు 8న తమిళంలో జీ5లో మామన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది.

తమిళంలో పాపులర్ కమెడియన్ సూరి ఈ మామన్ సినిమాలో హీరోగా నటించాడు. తెలుగులో డబ్ అయిన సూర్య.. యముడు సినిమాలు, కాంచన 3 తదితర మూవీల్లో సూరి నటించాడు. 2023లో హీరోగా విడుదలై పార్ట్ 1 చేశాడు. తెలుగులో అది విడుదల టైటిల్ తో రిలీజైంది. ఇప్పుడు మామన్ మూవీలో మరోసారి యాక్టింగ్ తో అదరగొట్టాడు. స్టోరీ కూడా అతనే అందించాడు. ఈ మూవీకి ప్రశాంత్ పాండ్యరాజ్ డైరెక్టర్. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. రాజ్ కిరణ్, శ్వాసిక, మాస్టర్ ప్రగీత్, బాబా భాస్కర్ తదితరులు కూడా యాక్ట్ చేశారు.

ఎమోషనల్ కామెడీ డ్రామా అనుభవం

ఇన్బా (సూరి) సిస్టర్ గిరిజ. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఆమెకు బాబు పుడతాడు. ఆ బిడ్డను లడ్డూ అని పిలుస్తూ అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. డాక్టరైన హీరోయిన్ రేఖ (ఐశ్వర్య లక్ష్మీ) గిరిజకు ఫ్రెండ్. గిరిజ ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇన్బా తీసుకున్న కేరింగ్ చూసి ప్రేమలో పడుతుంది. పెద్దలను ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకుంటారు. కానీ అక్కడి నుంచి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఇన్బాకు లడ్డూ అంటే చాలా ఇష్టం. జాయింట్ ఫ్యామిలీ, లడ్డూ కారణంగా ఇన్బా, రేఖకు ప్రైవేట్ టైమ్ దొరకదు. ఒకసారి తాతయ్య గదిలోకి వెళ్తే మంచంపై రొమాన్స్ చేద్దామంటే మంచం విరిగిపోతుంది. ఎప్పుడూ లడ్డూ వీళ్ల మధ్యలో వస్తాడు.

దీంతో గిరిజ, రేఖకు మధ్య గొడవ జరుగుతుంది. తనకు ట్రాన్స్ ఫర్ కావడంతో ఇన్బాను తీసుకుని రేఖ మధురై వెళ్లిపోతుంది. అక్కడ రేఖ ప్రెగ్నెంట్ అవుతుంది. మరోవైపు ఇన్బా లేకపోవడంతో లడ్డూ కుంగిపోతాడు. అప్పుడు ఇన్బా చనిపోయాడని లడ్డూకు చెప్తారు. లడ్డూతో పాటు గిరిజ, భర్తకు యాక్సిడెంట్ అవుతుంది. వీళ్లను చూసేందుకు భార్యకు ఇచ్చిన ప్రామిస్ పక్కనపెట్టి ఇన్బా వస్తాడు. అప్పుడు రేఖ తాళి తెంచుకుని వెళ్లిపోతుంది. మరి యాక్సిడెంట్ లో లడ్డూకు ఏమైంది? రేఖ, ఇన్బా మళ్లీ కలిశారా? అన్నదే కథ.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘మామన్’ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. కామెడీ, ఎమోషన్లతో కూడిన ఈ కుటుంబ కథ మీరు తప్పకుండా చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.