|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Maareesan Review : ఒక్క సీన్‌ కూడా అంచనా వేయలేరు.. ఇది మామూలు మూవీ కాదు

Published: 30-08-2025, 12:17 AM
Maareesan Review : ఒక్క సీన్‌ కూడా అంచనా వేయలేరు.. ఇది మామూలు మూవీ కాదు

పోస్టర్లు, ట్రైలర్లకు మించి సాగే కథతో మారీశన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వడివేలు మరియు ఫాహద్ ఫాజిల్‌ల ప్రధాన పాత్రలతో ఈ చిత్రం రెండున్నర గంటల పాటు ఆసక్తిని నిలుపుకుంటుంది. దయ మరియు పిళ్ళైల ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం.

Key Points

1

మాములు సినిమాలకు భిన్నంగా, ప్రతి సన్నివేశం ఆశ్చర్యకరంగా ఉంటుంది.

2

వడివేలు మరియు ఫాహద్ ఫాజిల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటారు.

4

వీకెండ్ వాచ్‌కి అద్భుతమైన ఎంపిక.

అనూహ్యమైన కథాంశం

పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు కొన్ని సినిమాలు వాటి పోస్టర్లు, ప్రోమోలకు మించి ఉంటాయి. కొన్నాళ్ళ క్రితం ఏదైనా సినిమా చూసేటపుడు ఆ సినిమాలో వచ్చే తరువాత సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకులు కాస్తంత ఊహించగలిగారు. ఆపై కాలంలో దాదాపుగా సినిమా మొత్తాన్ని ఊహించగలుగుతున్నారు. కాని నేటి ప్రేక్షకులు సినిమా పోస్టర్, ప్రోమోలను బట్టి పూర్తి కథను అంచనా వేయగలుగుతున్నారు. అయితే కొంతమంది దర్శకుల ఆలోచనలను మాత్రం ప్రేక్షకులు ఇంకా అందుకోలేకపోతున్నారు.

ఆ సినిమాలే సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. ఆ కోవకు చెందినదే మారీశన్.ఈ సినిమాకు  కృష్ణమూర్తి కథ అందించగా సుదీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలు, మళయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. నిజానికి ఈ సినిమా మొత్తం వీరిద్దరి పాత్రలపైనే నడుస్తుంది. వందల మంది తారాగణం, కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలను నిలబెట్టుకోవడం కష్టమైన ఈ రోజుల్లో రెండంటే రెండే పాత్రలతో రెండున్నర గంటల పైన నిడివితో ప్రేక్షకులను మెప్పించడం నిజంగా అభినందనీయం.

నటీనటుల అద్భుత ప్రదర్శన

అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. దయాలన్ ఓ దొంగ, చాలా సార్లు దొంగతనం చేసి జైలుకి వెళుతున్నా తీరు మార్చుకోని మొండి దొంగ దయ. ఓ రోజు అలవాటుగా దయ ఓ ఇంట్లో దొంగతనం చేస్తుండగా చైన్ తో కట్టిపడేసున్న వేలాయుధం పిళ్ళైని కలుస్తాడు. అదే సమయంలో పిళ్ళైకి అల్జీమర్స్ వ్యాధి ఉందని గ్రహిస్తాడు దయ.మొదట పిళ్ళైని చూసిన దయ కాస్త కంగారు పడినా పిళ్ళై దగ్గర ఉన్న డబ్బు కోసం తనని విడిపిస్తాడు.

ఆకట్టుకునే కథనం

తన బావమరిదిని కలవడానికి తిరువన్నామలై వెళ్ళాలని చెప్పడంతో దయ పిళ్ళైని తాను తీసుకెళతానని నమ్మిస్తాడు. అలా వాళ్ళిద్దరి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ ప్రయాణం ఎన్నో అనూహ్య మలుపులు తిరిగి ప్రేక్షకుల మతి పోగొడుతుంది. సినిమా ఆద్యంతం ఆసక్తిని రేపుతుంది. ముందు చెప్పుకున్నట్టు ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సినిమా కథ కాదు కదా తరువాత సన్నివేశాన్ని కూడా అంచనా వేయలేరు. అంచనాలకు మించి సాగే ఈ సినిమా మీ వీకెండ్ వాచ్ కి మంచి ఛాయిస్.ఎందుకంటే ఇది మామూలు సినిమా అయితే కాదు. -హరికృష్ణ, ఇంటూరు

మొత్తంమీద, మారీశన్ ఒక అద్భుతమైన సినిమా అని చెప్పవచ్చు. అనూహ్యమైన ట్విస్టులు, మనోహరమైన కథనం ప్రేక్షకులను అలరిస్తాయి. ఖచ్చితంగా చూడదగిన చిత్రం ఇది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.