
బిచ్చగాడు సినిమాతో పాపులర్ అయిన విజయ్ ఆంటోనీ, తన క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్’ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నాడు. నలుపు రంగులోకి మారే డెడ్ బాడీలు, సీరియల్ హత్యలు ఈ సినిమా కథాంశం.
Key Points
విజయ్ ఆంటోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'మార్గన్' ఓటీటీలోకి
నలుపు రంగులోకి మారే డెడ్ బాడీలు, సీరియల్ హత్యల రహస్యం
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోనీ అద్భుతమైన నటన
మార్గన్ సినిమా ఓటీటీ రిలీజ్
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆ మల్టీ టాలెంటెడ్ హీరో ఆ తర్వాత తన మూవీస్ ను తెలుగులోనూ తీసుకొస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. అలాంటి ఓ విభిన్నమైన కథతో రీసెంట్ గా ‘మార్గన్’ (Maargan) సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను అలరించాడు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
థియేటర్లలో అదరగొట్టిన మార్గన్ సినిమా ఇవాళ (జులై 25) ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మూడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఈ సినిమా ఓటీటీ లో ప్రసారమవుతోంది.
ధృవ కుమార్ అలియాస్ ధృవ ( విజయ్ ఆంటోనీ ) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ముంబయిలో అడిషనల్ డీజీపీగా పనిచేస్తుంటాడు. తన తెలివితేటలు, ధైర్యసాహసాలతో ఎన్నో క్లిష్టమైన కేసులను ఈజీగా సాల్వ్ చేస్తాడు. హైదరాబాద్ సిటీలో రమ్య అనే యువతి దారుణంగా హత్యకు గురవుతుంది.
నలుపు రంగు డెడ్ బాడీల రహస్యం
ఆమె డెడ్‌బాడీ మొత్తం నలుపు రంగులోకి మారుతుంది. ఆ హత్యకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవు. అదే తరహాలో గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని హత్యలు జరుగుతాయి.
చనిపోయిన వారిలో ధృవ కూతురు ప్రియ కూడా ఉంటుంది. సీరియల్ మర్డర్స్ కేసును ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను ధృవ చేపడతాడు. ఈ హత్యలకు అరవింద్ (అజయ్ దిషాన్) అనే యువకుడికి సంబంధం ఉందని ధృవ అనుమానిస్తాడు. అతడి అనుమానం నిజమేనా?
అరవింద్‌కు ఉన్న అతీంద్రయ శక్తులు ఏమిటి? ఈ సీరియల్ మర్డర్స్ వెనుక ఎవరున్నారు? రమ్య, వెన్నెల, అఖిల, శృతి, మేఘ అనే అమ్మాయిల గురించి ధృవకు ఎలాంటి నిజాలు తె లిశాయి? అసలైన హంతకుడిని ధృవ ఎలా పట్టుకున్నాడు? తన కూతురు మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
విజయ్ ఆంటోనీ నటన
మార్గన్ మూవీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోనీ ఆదరగొట్టాడు. సీరియస్‌గా సాగే రోల్‌లో సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. నెగెటివ్ ఛాయలతో సాగే పాజిటివ్ క్యారెక్టర్‌లో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ నటించాడు. సూపర్ పవర్స్‌తో డిఫరెంట్‌గా అతడి పాత్ర సాగుతుంది. సెకండాఫ్‌లో అతడే సినిమాకు హీరో అనే ఫీలింగ్ కలుగుతుంది.
జూన్ 27న థియేటర్లలో రిలీజైన మార్గన్ సినిమాకు లియో జాన్ పాల్ డైరెక్టర్. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పై మీరా విజయ్ ఆంటోనీ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా విజయ్ ఆంటోనీనే కావడం విశేషం.
విజయ్ ఆంటోనీ నటనతో ‘మార్గన్’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులు తప్పకుండా చూడాలి.


