
📌 Key Points
- ‘మ్యాడ్’ మరియు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలు సితార బ్యానర్‌లో పెద్ద విజయాలు సాధించాయి.
- నిర్మాత నాగవంశీ ‘మ్యాడ్ 3’ ప్రాజెక్ట్ రద్దయిందని స్పష్టం చేశారు.
- ‘మ్యాడ్ జూనియర్స్’ పేరుతో కొత్త సినిమా రాబోతుంది, ఇందులో పాత నటీనటులు ఎవరూ ఉండరు.
- 2026లో ‘మ్యాడ్ జూనియర్స్’ షూటింగ్ జరగనుంది; పాత నటులు అతిథి పాత్రల్లో కనిపించవచ్చు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన హిట్ సినిమా ‘మ్యాడ్’ ఫ్రాంచైజీ నుంచి కీలక అప్‌డేట్. ‘మ్యాడ్ 3’ ప్రాజెక్ట్ రద్దయిందని, దానికి బదులు పూర్తిగా కొత్త నటీనటులతో ‘మ్యాడ్ జూనియర్స్’ సినిమా రాబోతుందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ఈ వార్త అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
‘మ్యాడ్ 3’కి బదులు ‘మ్యాడ్ జూనియర్స్’
సితార సంస్థ నాగవంశీ నిర్మాణం నుంచి ఆ సినిమాలు వచ్చి పెద్ద హిట్ అయ్యాయి.(Mad Movies)
Mad Movies : సితార నిర్మాణ సంస్థ ఎంటర్టైన్మెంట్ సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్స్ కొడుతుంది. చిన్న చిన్న సినిమాలతో కూడా హిట్స్ కొట్టింది. ఈ క్రమంలో మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు సితార సంస్థ నాగవంశీ నిర్మాణం నుంచి వచ్చి పెద్ద హిట్ అయ్యాయి.(Mad Movies)
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మ్యాడ్ పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ కూడా తీసి హిట్ కొట్టారు. ఈ సినిమాకు మరో సీక్వెల్ మ్యాడ్ 3 కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించారు.
పాత తారాగణం లేకుండానే సీక్వెల్
అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మ్యాడ్ 3 సినిమా లేదు. మ్యాడ్ జూనియర్స్ అని తెరకెక్కిస్తున్నాము. మ్యాడ్ స్క్వేర్ కథ జరిగిన నాలుగేళ్ల తర్వాత అదే కాలేజీలో అందరూ కొత్తవాళ్లతో నడిచే కథ. మిస్డ్ సినిమాల్లో ఉన్న వాళ్ళెవరూ ఈ సినిమాలో ఉండరు. అందరూ కొత్తవాళ్ళతోనే తీస్తున్నాము అని తెలిపారు.
నాగవంశీ వెల్లడించిన కీలక విషయాలు
దీంతో మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమా నటీనటులు లేకుండానే నెక్స్ట్ మ్యాడ్ సినిమా మ్యాడ్ జూనియర్స్ అనే టైటిల్ తో కొత్తవాళ్లతో రాబోతుందని తెలుస్తుంది. 2026 లోనే ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం. ఆ సినిమాల్లో నటించిన కొంతమంది మాత్రం గెస్ట్ అప్పిరెస్ట్ ఇస్తారేమో చూడాలి. మరి రెండు మ్యాడ్ సినిమాలు మెప్పించాయి ఈ మూడో మ్యాడ్ ఏం చేస్తుందో..
మొత్తానికి, ‘మ్యాడ్ 3’ ఆశలు పక్కనపెట్టి, కొత్త కాస్ట్‌తో రాబోతున్న ‘మ్యాడ్ జూనియర్స్’ ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి. గత విజయాలను కొనసాగించి, ఈ కొత్త వెర్షన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తుంది.


