
📌 Key Points
- బిగ్ బాస్‌ను దెబ్బకొట్టేందుకు వస్తున్న ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ రియాలిటీ షో!
- జీయో హాట్‌స్టార్‌లో శ్రీముఖి హోస్ట్‌గా.. త్వరలో స్టార్ మాలో ప్రసారం!
- పది సెలబ్రిటీ జంటల మధ్య రిలేషన్స్, నమ్మకం, పోరాటాల ఆసక్తికర ప్రదర్శన!
- దర్శకుడు అనిల్ రావిపూడి, నటీమణులు లయ, రాధా జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు!
బుల్లితెర ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! బిగ్ బాస్‌ను దెబ్బకొట్టేందుకు ఒక కొత్త రియాలిటీ షో వస్తోంది. ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ పేరుతో వస్తున్న ఈ షోలో లవర్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక చూసేద్దాం!
శ్రీముఖి హోస్ట్‌గా ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షో!
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి బుల్లితెరపై మంచి ఆదరణ లభిస్తుంది. బాగా పాపులర్ అయ్యింది. అత్యంత చర్చనీయాంశంగా మారిన షో ఇది. ప్రతి ఏడాది 105 రోజులు బుల్లితెర ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఎంగేజ్ చేస్తుంది. టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీ అవుతుంది. దీని చుట్టూ చాలా కంటెంట్ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని దెబ్బకొట్టే షో వస్తోంది. లవర్స్ షో వస్తోంది. `మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్` అనే షో రాబోతుంది.
శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ షో జీయో హాట్ స్టార్‌లో రాబోతుంది. స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఇందులో పది సెలబ్రిటీ జంటలను ఒక ఇంట్లో ఉంచుతారు. వారి రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అనేది, ఒకరిపై ఒకరికి ఎంత నమ్మకం ఉందనేది, తమ రిలేషన్‌ని నిలబెట్టుకునేందుకు వాళ్లు ఏం చేస్తారు? తమ వారికోసం ఎలా పోరాడతారు? అసలు పది జంటలు ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు? ఎలా సర్వైవ్ అవుతారు? వారి రిలేషన్ లోని నిజాయితీ ఎంత? అనేది ఆవిష్కరించే విధంగా ఈ `మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్` షో ఉండనుంది.
పది జంటలు.. పది వారాలు.. అసలు రచ్చ అంటే ఇదే!
ఇందులో స్టార్ మా సీరియల్స్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు. శివ-ప్రియాంక జైన్, నూకరాజు-ఆసియా, వసంతి-కళ్యాణ్, జాను-భాను, బింటూ-సంధ్య, సోనియా-సిద్దు, సాండ్రా-మహేష్, నీతూ-నటరాజ్, హరిత-హరీష్, అంజలి-పవన్ వీరంతా జంటలుగా `మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్` షోకి వచ్చారు. ఈ పది జంటలు పదివారాల పాటు హౌజ్‌లో ఉండబోతున్నారు. వీరిలో చివరి వరకు ఏ జంట నిలబడుతుంది? టైటిల్ విన్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ షో మార్చి 15న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. దీనికి దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ నటీమణులు లయ, రాధా జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇరవై మంది(పది జంటలు) లవర్స్ కలిసి ఒకే ఇంట్లో ఉంటే వాళ్లు చేసే రచ్చ, వాళ్ల మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. చూసే ఆడియెన్స్ కి కావాల్సిన మసాలా కంటెంట్ గట్టిగానే వస్తుందని చెప్పొచ్చు. ఇక లవర్స్ కి అయితే పండగే అని చెప్పొచ్చు. వాళ్లకి కావాల్సిన స్టఫ్ గట్టిగానే దొరుకుతుందని చెప్పొచ్చు.
అనిల్ రావిపూడి జడ్జ్‌మెంట్.. ఏ జంట గెలుస్తుందో చూడాలి!
అయితే ఈ షో ప్రోమో కి నెటిజన్లు రియాక్ట్ అవుతూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కొంపలో కుంపటి అని, ఇది లవర్స్ ని విడగొట్టే షో అని, వీరు పది వారాలు కలిసి ఉండటం కష్టమే అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు, ఈ జంటలు బెస్ట్ అని, ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చారని, ఒకరికొకరు లైఫ్ ఇచ్చుకున్నారని అంటున్నారు. అదే సమయంలో కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్లని తీసుకొస్తే బాగుండేది. వాళ్ల అనుభవాలు చెబుతారని అంటున్నారు.
మొత్తంగా ఈ షో ఆద్యంతం రసవత్తరంగా ఉండబోతుందని, లవర్స్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ షో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. అయితే ఇదే క్లిక్ అయితే బిగ్ బాస్ షోకి పెద్ద దెబ్బగా మారబోతుందని చెప్పొచ్చు. లవర్స్ ఇచ్చే కంటెంట్ సింగిల్స్ ఇవ్వలేదు. అది బిగ్ బాస్ షోకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.
మొత్తానికి ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షో బిగ్ బాస్‌కి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. లవర్స్ మధ్య జరిగే ఈ రచ్చ ఎలా ఉంటుందో చూడాలంటే వేచి ఉండాల్సిందే. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


