|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Madhan Bob: అనారోగ్యంతో ప్రముఖ హాస్య నటుడు మృతి

Published: 02-08-2025, 11:45 AM
Madhan Bob: అనారోగ్యంతో ప్రముఖ హాస్య నటుడు మృతి

ప్రముఖ తమిళ హాస్యనటుడు మదన్ బాబ్ (71) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం చెన్నైలోని నివాసంలో మృతి చెందారు. కోలీవుడ్‌లో విషాదం నెలకొంది.

Key Points

మదన్ బాబ్ కన్నుమూత

ఇండస్ట్రీలో మర విషాదం. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు మరోసారి విషాదం నెలకొంది. తమిళ ప్రముఖ నటుడు, కమెడియన్ మదన్ బాబ్(71) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన.. శనివారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

దీర్ఘకాలిక అనారోగ్యంతో పోరాటం

మదన్ బాబ్ అసలు పేరు ఎస్.కృష్ణమూర్తి. ముఖంలో డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా టీవీ ఇండస్ట్రీలోకి తొలుత వచ్చారు. విచిత్రమైన హావభావాలు చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న కమెడియన్ పాత్రలు దక్కించుకున్నారు. కొన్నాళ్లకు స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించారు. ఆరు, జెమిని (విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ తదితర చిత్రాల్లో మదన్ నటించారు. తెలుగులో పవన్ కల్యాణ్ ‘బంగారం’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. మదన్ కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సినిమా జీవితం

తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు. మదన్ బాబ్ మరణం తో కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.