|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Madhavan: వివాహితులు ఇతరులతో రొమాంటిక్ సీన్స్‌లో నటించలేరు.. షాకింగ్‌గా స్టార్ హీరో కామెంట్స్

Published: 10-07-2025, 11:04 AM
Madhavan: వివాహితులు ఇతరులతో రొమాంటిక్ సీన్స్‌లో నటించలేరు.. షాకింగ్‌గా స్టార్ హీరో కామెంట్స్

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన తాజా ఇంటర్వ్యూలో వివాహితులకు రొమాంటిక్ సీన్స్‌లో నటించడం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం…

Key Points

1

మాధవన్ వివాహితులకు రొమాంటిక్ సీన్స్‌లో నటించడం కష్టమని అభిప్రాయపడ్డారు.

2

నిజమైన అనుబంధం లేకుంటే సీన్స్‌లో ఎమోషన్స్ రావడం కష్టమని వివరించారు.

4

ఆయన నటించిన ‘ఆప్ జైసా కోయి’ సినిమా జులై 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది.

మాధవన్ షాకింగ్ కామెంట్స్

నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు.. ఇలా మల్టీ యాంగిల్స్‌లో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు ఆర్. మాధవన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆప్ జైసా కోయి’. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వివేక్ సోని దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ఫాతిమా సనా షేక్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్.. పెళ్లి అయినా హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘సహా నటీనటుల మధ్య నిజమైన అనుబంధం ఉంటేనే కెమిస్ట్రీ మంచిగా వర్కౌట్ అవుతోంది. అది లేకపోతే ఎలాంటి సీన్స్ అయినా ఎమోషనల్‌గా ఉండవు. అలాగే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం కాంట్రవర్సీగా వినిపించవచ్చు.. కానీ, నా అభిప్రాయం ప్రకారం.. వివాహితులు ఇతరులతో రొమాంటిక్ సీన్స్ నటించడం అంత సహజంగా ఉండవు. ఎందుకంటే మనసులో ఎక్కడో కొంత భయం, ఆంక్ష ఉంటుంది. అలాగే వయసు వ్యత్యాసం అనేది సినిమా కథకు పెద్ద అడ్డంకి కాదు. నిజ జీవితంలో కూడా వయసులో తేడా ఉన్న జంటలు చాలానే ఉన్నాయి. ఆడియన్స్ నటీనటుల పర్ఫామెన్స్‌కు, కథకు రెస్పాండ్ అవుతారు. ఏజ్‌కి కాదు’ అని చెప్పుకొచ్చాడు.

రొమాంటిక్ సీన్స్‌పై ఆయన అభిప్రాయం

‘ఆప్ జైసా కోయి’ సినిమా విడుదల

చివరగా, మాధవన్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చకు దారితీస్తున్నాయి. వయసు, వివాహం కంటే నటన, కథే ముఖ్యమని ఆయన నమ్ముతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.