|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Madhu Priya: చెల్లి పెళ్లిలో సింగర్ మధుప్రియ.. ఫోటోలు వైరల్

Published: 27-07-2025, 6:15 AM
Madhu Priya: చెల్లి పెళ్లిలో సింగర్ మధుప్రియ.. ఫోటోలు వైరల్

‘ఆడపిల్లనమ్మా’ పాటతో పేరు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ తన చెల్లి పెళ్లి వేడుకలో పాల్గొంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధుప్రియ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

Key Points

1

గాయని మధుప్రియ చెల్లి పెళ్లి వేడుకల్లో పాల్గొంది.

2

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4

మధుప్రియ తన చెల్లికి శుభాకాంక్షలు తెలిపింది.

మధుప్రియ చెల్లి పెళ్లి వేడుక

‘ఆడపిల్లనమ్మా’ పాటతో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ.. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాల్లో ఫోక్ సాంగ్స్ పాడుతూ కాస్త బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె తన చెల్లికి దగ్గరుండి పెళ్లి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చెల్లి-మరిదికి శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది.

వైరల్ అవుతున్న ఫోటోలు

తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో ‘ఆడపిల్లనమ్మా’ పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో ‘దగ్గరగా దూరంగా’ సినిమాలో ‘పెద్దపులి’ అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడింది.

18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మధుప్రియ.. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన చెల్లి శ్రుతిప్రియకి సుమంత్ పటేల్ అనే వ్యక్తితో పెళ్లయింది. చెల్లి వివాహంతో తనకెంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మధుప్రియ సినీ జీవితం

మొత్తానికి, మధుప్రియ చెల్లి పెళ్లి వేడుక సందడిగా జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఈ ఆనందాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కొత్త జంటకు అభినందనలు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.