|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Madonna Sebastian: అందులో తప్పేముంది.. అసభ్యత, గ్లామర్ షో ఒకటి కాదు.. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు..

Published: 25-10-2025, 10:42 PM
Madonna Sebastian: అందులో తప్పేముంది.. అసభ్యత, గ్లామర్ షో ఒకటి కాదు.. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు..

మలయాళ నటి మడోనా సెబాస్టియన్ గ్లామర్ షోపై వచ్చిన విమర్శలకు ధీటుగా స్పందించింది. గ్లామర్, అసభ్యత ఒకటి కాదని, తనకు ఏం చేయాలో స్పష్టంగా తెలుసని పేర్కొంది. ఈ విషయంలో తన పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని తేల్చి చెప్పింది.

Key Points

1

మలయాళ నటి మడోనా సెబాస్టియన్ ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం.

2

సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేయడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి.

4

ఈ ప్రకటనతో తను గ్లామర్ పాత్రలకు సిద్ధంగా ఉన్నానని మడోనా సంకేతాలిచ్చింది.

మడోనా సినీ ప్రస్థానం, తెలుగు ఎంట్రీ

Madonna Sebastian: మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాల్లో కనిపించింది. కానీ, మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ సినిమా చూసిన వారు మాత్రం మడోనాను అంత ఈజీగా (Madonna Sebastian)మర్చిపోలేరు. ఇక ఈ మలయాళ బ్యూటీ తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించింది. వాటిలో ఒకటి ప్రేమమ్ రీమేక్ కాదా రెండవది నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్. ఈ రెండు సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని సైతం మెప్పించింది కానీ, అవకాశాలు మాత్రం దక్కిచుకోలేకపోయింది.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లో డబుల్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన పచ్చళ్ళ పాప.. శ్రీజ రీ ఎంట్రీ ఫిక్స్?

గ్లామర్ షోపై మడోనాకు విమర్శలు

ఇక మడోనా సెబాస్టియన్ గ్లామర్ షోకి దూరంగా ఉంటుంది. చేసిన తక్కువ సినిమాలే అయినా ఎక్కువ స్కిన్ షో మాత్రం చేయలేదు. కానీ, ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూసి ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పొట్టి బట్టలు వేసుకొని స్కిన్ షో చేస్తూ గ్లామర్ తో రచ్చ చేసింది. ఇదేంటి మడోనా ఇలా చేస్తోంది అంటూ ఆమె ఫ్యాన్స్ అవాక్కయ్యారు. కొంతమంది సోషల్ మీడియాలో ఆమెను ట్యాగ్ చేస్తూ చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మడోనా వరకు చేరడంతో ఆమె కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.

నాకు ఏం చేయాలో తెలుసు – మడోనా కౌంటర్

ఈమేరకు మడోనా సోషల్ మీడియాలో స్పందిస్తూ..”గ్లామర్‌ షో తెప్పం కాదు. కానీ, గ్లామర్ కి అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు. అది నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలుసు”అంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి ఈ ఒక్క పోస్ట్ తో తాను కూడా గ్లామర్ షో కి సిద్ధం అంటూ సిగ్నల్ ఇచ్చేసింది మడోనా. మరి ఇకనైనా ఆమెకు వరుస అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.

మొత్తానికి, మడోనా తన గ్లామర్ షోపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. ఇది గ్లామర్ పాత్రలకు తను సిద్ధమని పరోక్షంగా చెప్పినట్లయ్యింది. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.