|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

16 ఏళ్ళు పూర్తి చేసుకున్న మగధీర: ఆ స్టార్ క్రికెటర్ కి ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఇదే

Published: 31-07-2025, 9:14 PM
16 ఏళ్ళు పూర్తి చేసుకున్న మగధీర: ఆ స్టార్ క్రికెటర్ కి ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఇదే

రాజమౌళి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం 16వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Key Points

1

మెగాస్టార్ రాంచరణ్ నటించిన మగధీర 16 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

2

రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

4

భారత క్రికెట్ జట్టు ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇది తన అభిమాన చిత్రమని పేర్కొన్నారు.

మగధీర: ఒక మైలురాయి

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాంచరణ్ 2వ చిత్రం కావడంతో రాజమౌళి మగధీర మూవీని దృశ్య కావ్యంలా తెరకెక్కించారు. నిర్మాతగా అల్లు అరవింద్ ఈ చిత్రం కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ లో రూపొందిన మగధీర చిత్రం బాలీవుడ్ సైతం నివ్వెరపోయేలా 80 కోట్ల వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ చిత్రం విడుదలై 16 ఏళ్ళు పూర్తయింది. 2009 జూలై 30న ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో మగధీర విశేషాలని గుర్తు చేసుకుంటున్నారు. మగధీర చిత్రం రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ షోని మెగా ఫ్యామిలీతో పాటు, చిత్ర పరిశ్రమలో ప్రముఖులు కూడా వీక్షించారు. ఈ మూవీలో పునర్జన్మల నేపథ్యంలో కథ, గుర్రపు స్వారీ సన్నివేశాలు, 100 మంది వీరులతో పోరాటం, శ్రీహరి పాత్ర, రాంచరణ్ కాజల్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచాయి.

A pathbreaking spectacle. 🔥 An epic saga of love, valour, and destiny.❤️‍🔥 Celebrating 16 glorious years of #Magadheera and still unrivaled in scale, soul, and storytelling! ⚔️ #16YearsOfHistoricIHMagadheera #16YearsForMagadheera Global Star ⭐️ @AlwaysRamCharan @ssrajamouli … pic.twitter.com/5MqRfX4YjP

అద్భుతమైన విజయం

— Geetha Arts (@GeethaArts) July 31, 2025

అంతకు ముందు టాలీవుడ్ లో పోకిరి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా ఉండేది. పోకిరి కలెక్షన్లని మగధీర చిత్రం డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా మగధీర చిత్రం సినీ అభిమానులని, టాలీవుడ్ సెలెబ్రిటీలని మాత్రమే కాదు క్రీడా ప్రముఖుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

క్రికెటర్ అశ్విన్ అభిమాన చిత్రం

టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కి మగధీర చిత్రం ఆల్ టైం ఫేవరిట్ మూవీ అట. ఈ విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్ ఓ సందర్భంలో తెలిపారు. క్రికెటర్ హనుమ విహారితో కలసి అశ్విన్ ఓ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ చిట్ చాట్ లో అశ్విన్ తనకు తెలుగు సినిమాల గురించి చెప్పమని విహారిని అడిగారు.

దీనితో విహారి రీసెంట్ గా తాను చూసిన చిత్రాల గురించి చెప్పాడు. మీకు తెలుగులో ఇష్టమైన మూవీ ఏంటి అని అశ్విన్ ని అడిగారు. దీనితో అశ్విన్ ఏమాత్రం తడబాటు లేకుండా నా ఆల్ టైం ఫేవరిట్ మూవీ మగధీర అని చెప్పారు. అప్పుడప్పుడూ తాను తెలుగు సినిమాలు చూస్తుంటానని.. తన కుటుంబ సభ్యులకు అయితే తెలుగు సినిమాలు అంటే పిచ్చి అని అశ్విన్ పేర్కొన్నారు. అడివి శేష్ ఎవరు చిత్రాన్ని కూడా తాను చూశానని వెరీ గుడ్ మూవీ అని ప్రశంసించారు. అదే విధంగా మహేష్ బాబు ఒక్కడు మూవీ అంటే కూడా తనకి ఇష్టం అని అశ్విన్ పేర్కొన్నారు.

మొత్తంమీద, మగధీర చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. దాని విజయం సినీ ప్రేక్షకులను మాత్రమే కాదు, క్రీడా ప్రముఖులను కూడా ఆకర్షించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.