|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నవరాత్రుల్లో మహాభాగ్య యోగం: ఉద్యోగాలు, డబ్బు, అదృష్టం!

Published: 09-09-2025, 11:46 PM
నవరాత్రుల్లో మహాభాగ్య యోగం: ఉద్యోగాలు, డబ్బు, అదృష్టం!

దసరా నవరాత్రుల సమయంలో గ్రహాల సంయోగం వల్ల మహాభాగ్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, ఆర్థిక లాభాలు, ఆరోగ్యం మెరుగుపడతాయి.

Key Points

1

మహాభాగ్య యోగం వల్ల ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి.

2

తులా, మకర, సింహ రాశుల వారు ఈ యోగం వల్ల అధిక లాభాలు పొందుతారు.

4

నవరాత్రుల సమయంలో దేవతలను ఆరాధించడం శుభప్రదం.

మహాభాగ్య యోగం అంటే ఏమిటి?

త్వరలో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. చంద్రుడి సంచారం కూడా చాలా ముఖ్యమైనది. అయితే రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఇతర గ్రహాలతో సంయోగం చెందినప్పుడు శుభ ఫలితాలు ఏర్పడతాయి.

ఇప్పుడు త్వరలో మహాభాగ్య రాజయోగం ఏర్పడనుంది. అది కూడా నవరాత్రుల సమయంలో ఏర్పడనుంది. నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 13న కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. నవరాత్రులులో సెప్టెంబర్ 24న ఉదయం 2:55కి తులా రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు.

సెప్టెంబర్ 26 వరకు అదే రాశిలో కొనసాగిస్తాడు. అయితే ఈ రెండు గ్రహాల సంయోగంతో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి. మహాభాగ్య యోగంతో ఈ రాశుల వారికి కలిసి రానుంది. మహాభాగ్య రాజయోగంతో ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలను పొందుతారు? ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.

యోగం వల్ల ఏ రాశులకు లాభాలు?

మకర రాశి వారికి మహాభాగ్య యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. కొత్త ఆర్డర్లు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ని అందుకుంటారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది.

తులా రాశి వారికి మహాభాగ్య రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సకల సౌకర్యాలను పొందుతారు. ప్రతి ఒక్కరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఎన్నో ప్రశంసలు కూడా వస్తాయి. వ్యాపారంలో కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఓ మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా బావుంటుంది. ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది.

నవరాత్రుల్లో దేవతల ఆరాధన

సింహ రాశి వారికి మహాభాగ్య రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. కుజ చంద్రుల సంయోగం కెరీర్‌లో పురోగతిని తీసుకువస్తుంది. వ్యాపారులకు ఇది శుభ సమయం. కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి. పెద్ద నిర్ణయాలను ఈ సమయంలో తీసుకుని విజయాన్ని చేరుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

నవరాత్రుల సమయంలో ఈ మహాభాగ్య యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. దేవతలను భక్తితో ఆరాధించి, ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.