
మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు బార్బరిక్ క్యారెక్టర్ స్ఫూర్తితో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బరిక్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఉదయభాను లేడీ విలన్‌గా నటించిన ఈ చిత్రం 9.3 ఐఎండీబీ రేటింగ్‌తో సన్ నెక్స్ట్‌లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ ఆసక్తికరమైన మూవీ విశేషాలు తెలుసుకుందాం.
Key Points
'త్రిబాణధారి బార్బరిక్' మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు బార్బరిక్ స్ఫూర్తితో తెరకెక్కింది.
ఉదయభాను ఈ సినిమాలో లేడీ విలన్ (వాకిలి పద్మ) పాత్ర పోషించారు.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు 9.3 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీలోకి
బార్బరిక్.. మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు పేరు. ఈ క్యారెక్టర్ స్ఫూర్తితో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ రోజు (అక్టోబర్ 10) నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇందులో ఉదయ భాను లేడీ విలన్ గా నటించడం విశేషం.
త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీ
ఓటీటీలోకి లేటేస్ట్ తెలుగు సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్ వచ్చేసింది. ఈ మూవీ శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను , వశిష్ఠ ఎన్.సింహ, సత్యం రాజేశ్, సాంచీ రాయ్ తదితరులు నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సన్ నెక్ట్స్ ఓటీటీ యాప్ లోకి వచ్చేసింది. తెలుగు తో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉంది. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథాంశం ఏంటి?
త్రిబాణధారి బార్బరిక్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స డైరెక్టర్. ఈ చిత్రానికి 9.3 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఇప్పుడు ఓటీటీలోకి డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. అక్టోబర్ 10 నుంచి సన్ నెక్ట్స్ లో తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.
త్రిబాణధారి బార్బరిక్ మూవీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను లేడీ డాన్ రోల్ ప్లే చేయడం విశేషం. శ్యామ్ కతు (సత్యరాజ్) ఓ ఫేమస్ సైకియాట్రిస్ట్. తన కొడుకు, కోడలు చనిపోవడంతో మనవరాలు నిధిని ముద్దుగా పెంచుకుంటాడు. మనవరాలు చాలా ప్రేమగా చూసుకుంటాడు. మరోవైపు ఉదయ భాను లేడీ డాన్ గా క్రూరంగా కనిపిస్తుంది.
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది?
ఓ రోజు స్కూల్ కు వెళ్లిన నిధి మిస్ అవుతుంది. పోలీసులకు కంప్లయింట్ ఇస్తే కేసు ఎంక్వైరీ చేస్తారు. మరి ఆ పాప ఏమైంది? ఇందులో లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను), ఊర్లో ఉంటే రామ్ (వశిష్ఠ ఎన్ సింహా)కు సంబంధం ఏంటీ? తన మనవరాలి కోసం శ్యామ్ కతు ఏం చేశాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమాకు మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు బార్బరిక్ పేరు పెట్టడం కూడా మూవీపై ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ కు ఈ త్రిబాణధారి బార్బరిక్ మూవీ మంచి కిక్ ఇస్తుంది. ఇంకెందుకు లేటు సన్ నెక్ట్స్ లో ఈ మూవీ చూసేయండి మరి.
మొత్తానికి, ‘త్రిబాణధారి బార్బరిక్’ మహాభారత నేపథ్యం, ఉదయభాను విలన్ రోల్, మిస్టరీ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకుంటుంది. 9.3 రేటింగ్ తో ఆసక్తిగా ఉన్న ఈ సినిమాను ఇంకెందుకు ఆలస్యం, సన్ నెక్స్ట్‌లో ఇప్పుడే చూసేయండి.


