|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూ. 100 కోట్ల క్లబ్‌లో ‘మహావతార్‌ నరసింహ’

Published: 04-08-2025, 2:49 AM
రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మహావతార్‌ నరసింహ'

‘మహావతార్ నరసింహ’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రం కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విజయం చిత్ర యూనిట్‌కు అభినందనీయం.

Key Points

1

మహావతార్ నరసింహ 100 కోట్ల క్లబ్ లో చేరింది.

2

10 రోజుల్లోనే ₹105 కోట్లు కలెక్షన్స్ సాధించింది.

4

తెలుగులో ₹20 కోట్లు, హిందీలో ₹70 కోట్లకు పైగా కలెక్షన్స్.

వంద కోట్ల క్లబ్‌లోకి ‘మహావతార్‌ నరసింహ’

‘ మహావతార్‌ నరసింహ ‘ సినిమా వంద కోట్ల క్లబ్ ‌ లోకి చేరిపోయింది . ఈమేరకు తాజాగా చిత్ర యూనిట్ ‌ అధికారికంగా ప్రకటించింది . అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయ్, చైతన్య దేశాయ్‌ సంయుక్తంగా ఈ యానిమేటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు . జులై 25 న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్‌ పెంచుకుంటూ వెళుతున్నారు . బుక్ ‌ మైషోలో ఇప్పటికే 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి .

‘ మహావతార్‌ నరసింహ’ చిత్రం పదిరోజుల్లోనే రూ . 105 కోట్లు సాధించింది . భారత్ ‌ లో విడుదలైన యానిమేషన్ ‌ చిత్రాలలో ఇదే అత్యధిక కలెక్షన్స్ ‌ కావడం విశేషం . ఆల్ ‌ టైమ్ ‌ ఇండస్ట్రీ రికార్డ్ ‌ గా చిత్ర యూనిట్ ‌ ఇప్పటికే ప్రకటించింది . తెలుగులో గీత ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా రిలీజైంది. . ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం తన అదృష్టమని అల్లు అరవింద్‌ తెలిపారు. తెలుగులోనే ఏకంగా రూ . 20 కోట్లకు పైగా నెట్ ‌ రాబట్టినట్లు తెలుస్తోంది . హిందీలో రూ . 70 కోట్లకు పైగానే నెట్ ‌ కలెక్ట్ ‌ చేసినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి .

అద్భుతమైన కలెక్షన్స్‌తో రికార్డు సృష్టించింది

యానిమేషన్ చిత్రాలలో అగ్రస్థానం

మొత్తంమీద, ‘మహావతార్ నరసింహ’ సినిమా యానిమేషన్ చిత్రాలకు ఒక కొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. దీని భారీ విజయం సినిమా నిర్మాతలకు, ప్రేక్షకులకు సంతోషాన్నిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.