శ్రీ మహా విష్ణువు అవతారమైన నరసింహుని ఆధారంగా తెరకెక్కిన యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్‌ను ఊడదీస్తోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీ ప్రవేశంపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
Key Points
బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధిస్తున్న మహావతార్ నరసింహా.
రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన యానిమేటెడ్ సినిమా.
ఓటీటీ రిలీజ్ వివరాలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
క్లీమ్ ప్రొడక్షన్స్ ఓటీటీ రిలీజ్ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
బాక్సాఫీస్ వద్ద మహావతార్ నరసింహా విజయం
శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహా అవతారం ఆధారంగా వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narsimha) బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతోంది. మౌత్ టాక్ తో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ ఫిల్మ్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది.
థియేటర్లలో అదరగొడుతున్న మహావతార్ నరసింహా మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ నెలకొంది. రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రోహిత్ జైస్వాల్ ప్రకారం, మహావతార్ నరసింహ హిందీలో జియోహాట్‌స్టార్ లో విడుదలయ్యే అవకాశం ఉంది అని ఇండియా టైమ్స్ నివేదించింది. ఈ కన్నడ యానిమేటెడ్ ఫిల్మ్ తెలుగు సహా ఇతర భాషల్లోనూ థియేటర్లలో రిలీజైంది.
ఈ నేపథ్యంలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం వెర్షన్ లు వేర్వేరే ప్రాంతీయ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల కావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ లో గానీ లేదా అక్టోబర్ లో గానీ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుందనే ప్రచారం జోరందుకుంది.
ఓటీటీ రిలీజ్ పై ఊహాగానాలు
మహావతార్ నరసింహా ఓటీటీ రిలీజ్ పై వస్తున్న ఊహాగానాలకు ఈ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన క్లీమ్ ప్రొడక్షన్స్ తెరదించింది. హొంబలే ఫిల్మ్స్ తో కలిసి ఈ సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
‘‘ మహావతార్ నరసింహా మూవీ త్వరలోనే ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం మా వరకూ వచ్చింది. దానిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ మూవీ ఇంకా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను మేం కన్ఫార్మ్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో మా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వచ్చే అప్ డేట్స్ ను మాత్రమే నమ్మండి’’ అని క్లీమ్ ప్రొడక్షన్స్ తెలిపింది.
ప్రొడక్షన్ సంస్థ స్పందన
మహావతార్ నరసింహా మూవీ జులై 25న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా అంచనాలు లేకుండానే ఈ మూవీ వచ్చేసింది. కానీ ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో థియేటర్లు పెంచుకుంటూ పోయింది. కలెక్షన్లు క్రమంగా పెరిగాయి. పాన్ ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన మహావతార్ నరసింహా మూవీ ఇప్పటికే ఇండియాలోనే రూ.105 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాస్ కలెక్షన్లు రూ.120 కోట్లు దాటాయి.
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎప్పుడు అలరించబోతుందో తెలియాలంటే క్లీమ్ ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.


