|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మహావతార్ నరసింహా: 40 కోట్ల బడ్జెట్, 340 కోట్ల కలెక్షన్

Published: 22-09-2025, 12:14 AM
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మహావతార్ నరసింహా: 40 కోట్ల బడ్జెట్, 340 కోట్ల కలెక్షన్

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మహావతార్ నరసింహా యానిమేటెడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమా 340 కోట్లకు పైగా వసూలు చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

Key Points

1

40 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన మహావతార్ నరసింహా

2

340 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది

4

నేడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం

మహావతార్ నరసింహా ఓటీటీలోకి

బాక్సాఫీస్ ను షేక్ చేసి, బ్లాక్ బస్టర్ గా నిలిచిన లేటెస్ట్ మూవీ ‘మహావతార్ నరసింహా’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 19) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నరసింహ స్వామి కథతో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ సిరీస్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ మహావతార్ నరసింహా ’ మూవీ ఓటీటీ లో అడుగుపెట్టింది. ఈ యానిమేటెడ్ మూవీ ఈ రోజు మధ్యాహ్నం 12.30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీని ఓటీటీలో చూద్దామా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఇంకెందుకు లేటు ఈ మైథలాజికల్ చిత్రంపై ఓ లుక్కేసేయండి.

మహావతార్ నరసింహా రికార్డు

రికార్డు స్థాయి వసూళ్లు

మహావతార్ నరసింహా మూవీ రికార్డు నెలకొల్పింది. జులై 25న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కోట్లు కొల్లగొట్టింది. క్రమంగా మౌత్ టాక్ తో ఈ మూవీ వసూళ్లు పెరిగాయి. రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.340 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది.

అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహావతార్ నరసింహా మూవీ కథ అందరికీ తెలిసిందే. ప్రహ్లాదుడిని నారాయణుడు ఎక్కడా? అంటూ హిరణ్యకశిపుడు చిత్రహింసలు పెడతాడు. నా శత్రువు నీకు దేవుడు ఎలా అవుతాడంటూ బాధలు పెడాతాడు. కానీ నారాయణుడినే నమ్ముకున్న ప్రహ్లాదుడు భక్తితో కొలుస్తాడు. చివరకు రాక్షస రాజు హిరణ్యకశిపుడిని అంతం చేయాలని నారాయణుడే నరసింహా అవతారంగా వస్తాడు. ఈ కథను అద్భుతమైన యానిమేషన్ తో స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు అశ్విన్ కుమార్.

అశ్విన్ కుమార్ దర్శకత్వం

క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రం విష్ణువు పది అవతారాలతో ప్రేరణ పొందిన మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి భాగం. మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధౌకదేశ్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి (2035-2037) వంటి భవిష్యత్ చిత్రాలు ఈ సిరీస్ లో ఉన్నాయి.

ఈ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇకపై వరుసగా సినిమాలు రాబోతున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాల్లోనూ కథలను స్ఫూర్తిగా తీసుకుని ఈ యానిమేటెడ్ సిరీస్ లు రూపొందిస్తున్నారు.

మహావతార్ నరసింహా సినిమా విజయం తెలుగు సినిమా రంగంలో యానిమేషన్ సినిమాలకు మంచి అవకాశాలను తెరిచింది. భవిష్యత్తులో మరింత అద్భుతమైన యానిమేటెడ్ సినిమాలను ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.