|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మ‌హేష్ బాబు ఏజ్‌ పై ర‌ష్మిక హాట్ కామెంట్స్ !

Published: 03-11-2025, 8:15 AM
మ‌హేష్ బాబు ఏజ్‌ పై ర‌ష్మిక హాట్ కామెంట్స్ !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, మహేష్ బాబు వయస్సుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పటికీ యంగ్‌గానే కనిపిస్తారని, రోజురోజుకు మరింత యంగ్ అవుతున్నారని తెలిపారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Key Points

1

'ది గర్ల్ ఫ్రెండ్' ప్రమోషన్స్‌లో మహేష్ బాబు వయస్సుపై రష్మిక వ్యాఖ్యలు.

2

మహేష్ బాబు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటారని, రోజురోజుకూ మరింత యంగ్ అవుతున్నారని పేర్కొంది.

4

తన బెస్టీల పేర్లు చెబితే వాళ్లు చంపేస్తారని రష్మిక బాంబు పేల్చింది.

మ‌హేష్ బాబు వయస్సుపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ, తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలలో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. అయితే అలాంటి రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు మరో నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రిన్స్ మహేష్ బాబు వయసుపై ఆమె స్పందించారు. మహేష్ బాబు ఇప్పటికీ యంగ్ హీరోలా కనిపిస్తాడని తెలిపారు. ఆయన వయస్సు ఎప్పటికీ అయిపోదని, పైగా రోజురోజుకు ఆయన యంగ్ అవుతున్నారని కామెంట్స్ చేశారు. ఇదే అతనిలో తనకు ఇష్టమని, అసలు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలని నాకు ఉంది అని రష్మిక తెలిపారు. నాకంటూ కొంతమంది బెస్టీలు ఉన్నారు.. కానీ వాళ్ళ పేర్లు మాత్రం నేను చెప్పను అని వెల్లడించారు. అలా పేర్లు చెబితే నన్ను చంపేస్తారని బాంబు పేల్చారు. దీంతో ర‌ష్మిక కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక

రష్మిక బెస్టీల గుట్టు: ఎందుకు పేర్లు చెప్పదో తెలుసా?

మహేష్ బాబు వయస్సుపై రష్మిక చేసిన ఈ సరదా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె తన బెస్టీల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి, ఆమె ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.