
📌 Key Points
- రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రం 2027లో విడుదల కానుంది.
- ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రతో పాటు ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.
- రాముడి పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా ఉన్నారంటూ రాజమౌళి తెలిపారు, పోస్టర్ వైరల్ అవుతోంది.
- ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నారు, ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వారణాసి చిత్రం
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి(Varanasi) సినిమా పనులలో బిజీగా ఉన్నారు. మొదటిసారి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి .ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. 2026 జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా రాజమౌళి ప్లాన్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా రుద్ర పాత్ర మాత్రమే కాకుండా ఐదు విభిన్న పాత్రలలో మహేష్ బాబు కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్నట్టు స్వయంగా రాజమౌళి వెల్లడించారు. రాముడి గెటప్ లో మహేష్ బాబును చూస్తుంటే రాజసం ఉట్టిపడుతోందని అంత అద్భుతంగా కనిపించబోతున్నారు అంటూ రాజమౌళి తెలియచేశారు. మహేష్ బాబు రాముడి పాత్రకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ వారణాసి సినిమాకి సంబంధించిందేనా అంటూ అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ గుంటూరులోని మైత్రి సినిమాస్ లో డిజిటల్ పోస్టర్ ను ఏర్పాటు చేశారు దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాముడి పాత్రలో మహేష్ బాబు: వైరల్ అవుతున్న పోస్టర్
ఇకపోతే గుంటూరులోని మైత్రి సినిమాస్ లో ఈ పోస్టర్ ఏర్పాటు చేయడంతో ఇది నిజంగానే వారణాసి సినిమాలో మహేష్ బాబు పాత్రకు సంబంధించిన పోస్టరా లేకపోతే ఏఐ ద్వారా క్రియేట్ చేసినదా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పోస్టర్ పై చిత్ర బృందం మాత్రం ఏ విధమైనటువంటి ప్రకటన తెలియజేయకపోవడం గమనార్హం. మరి ఈ పోస్టర్ పై రాజమౌళి నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదల చేసిన తర్వాత రాజమౌళి ఏ విధమైనటువంటి అప్డేట్ వెల్లడించలేదని చెప్పాలి. తదుపరి అప్డేట్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ఏప్రిల్ 7 2027 వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇక ఇందులో రాజమౌళికి జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నారు అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు తండ్రి పాత్రలో మహాశివ భక్తుడిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాలో కన్నడ నటుడు సుదీప్ కూడా నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఏ విధమైనటువంటి స్పష్టత వెలబడలేదు.
సినిమాలో నటీనటులు మరియు విడుదల తేదీ వివరాలు
మొత్తానికి, మహేష్ బాబు రాముడి పాత్రలో ఎలా ఉంటారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విడుదల కోసం వేచి చూడాల్సిందే. త్వరలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online