|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసిలో శ్రీరాముడిగా మహేష్ బాబు.. లుక్ చూస్తే దిమ్మతిరగాల్సిందే! వైరల్ ఫోటోలు!

Published: 21-02-2026, 7:35 AM
వారణాసిలో శ్రీరాముడిగా మహేష్ బాబు.. లుక్ చూస్తే దిమ్మతిరగాల్సిందే! వైరల్ ఫోటోలు!
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ.. భారీ అంచనాలు!
  • రూ.1000 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ‘వారణాసి’ చిత్రం నిర్మాణం!
  • శ్రీరాముడిగా మహేష్ బాబు లుక్ వైరల్.. ఫ్యాన్స్ ఫిదా!
  • 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల.. రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధం!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఆ వివరాలు చూసేద్దాం!

రాజమౌళి మార్క్.. వారణాసి అంచనాలు భారీగా!

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి(Varanasi). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అందుకే ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్ వీడియోకి ఇంటర్నేషనల్ లెవల్లో ఎంతగా అప్లాజ్ వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

శ్రీరాముడిగా మహేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నాడు అని రాజమౌళి స్వయంగా చెప్పాడు. రామాయణంలో ఒక ప్రత్యేకమైన ఘట్టాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట రాజమౌళి. ఇక అప్పటినుంచి మహేష్ బాబు శ్రీరాముడిగా ఎలా ఉంటాడు, ఆ సీన్స్ ని రాజమౌళి ఎలా తెరకెక్కిస్తున్నాడు అనేది తెలుసుకోవడానికి చాలా ఎగ్జాయింటింగ్ ఉన్నారు.

2027లో విడుదల.. రికార్డులు షేక్ చేసేందుకు రెడీ!

ఈనేపథ్యంలోనే తాజాగా మహేష్ బాబు శ్రీరాముడిగా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీరాముడిగా చేతిలో విల్లు పట్టుకొని ఉన్న మహేష్ బాబు లుక్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ ఒక్క స్టైల్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ లుక్ కి సంబందించిన ఒక స్టాండీని మైత్రి మూవీస్ కి సంబందించిన థియేటర్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడమే కాదు. వారణాసి సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో అద్భుతంగా ఉన్నారని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.