
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఈడీ నుండి నోటీసులు అందిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఆయన ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. సాయి సూర్య డెవలపర్స్‌తో ఆయనకు ఉన్న సంబంధంపై విచారణ జరుగుతుంది.
Key Points
మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ
సాయి సూర్య డెవలపర్స్‌తో సంబంధం
నేడు ఈడీ విచారణకు హాజరు
ఈడీ నోటీసుల వివరాలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు (ED Notices) ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్‌లతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసు (Money laundering case)లో ఈడీ విచారణలో భాగంగా మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో భాగంగా ఆయన ఈ రోజు ఈడీ విచారణ (ED investigation)కు హాజరు కానున్నారు. సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.
ఇందులో రూ.3.5 కోట్లు నగదు, రూ.2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ ట్రాన్స్‌ఫర్ (RTGS Transfer) ద్వారా చెల్లించారు. దీనిపై విచారణకు ఏప్రిల్ 27, 28న విచారణకు రావాలని ఈడీ నోటీసులు (ED Notices) ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు.. షూటింగ్ వల్ల ఏప్రిల్ 27 లేదా 28న విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. అలాగే తాను విచారణకు వచ్చేందుకు మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఈ రోజు విచారణకు రావాలని సూచించింది. దీంతో నేడు మహేష్ బాబు (Mahesh Babu) ఈడీ విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది.
మనీ లాండరింగ్ కేసు
మహేష్ బాబు వివరణ
మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరై తన వైపు వివరణ ఇవ్వనున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాల కోసం ఎదురుచూడాల్సి ఉంది. విచారణ ఫలితాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.


