|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫ్యాన్స్ మధ్య మహేష్: బెంగళూరులో ఊహించని పరిస్థితి! ఒక్కసారిగా ఏం జరిగిందంటే?

Published: 16-01-2026, 8:00 AM
ఫ్యాన్స్ మధ్య మహేష్: బెంగళూరులో ఊహించని పరిస్థితి! ఒక్కసారిగా ఏం జరిగిందంటే?
  • బెంగళూరులో AMB సినిమాస్ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు హాజరు.
  • సూపర్ స్టార్ రాకతో అభిమానుల తాకిడి, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
  • సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు, ఇబ్బంది పడిన మహేష్ బాబు.
  • వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా.

సూపర్ స్టార్ మహేష్ బాబు బెంగళూరులోని ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలిరావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానుల తాకిడితో మహేష్ కాసేపు ఇబ్బంది పడ్డారు.

బెంగళూరులో మహేష్ బాబు సందడి

Magesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబుకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా చేయకపోయినా మహేష్ బాబుకు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ పెద్దగా బయట ఎక్కడ కనిపించరు, సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటారు అయినప్పటికీ తన సినిమాల ద్వారా తన నటన మంచి మనస్తత్వంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు బయటకు వస్తున్నారంటే అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ చూపించే అత్యుత్సాహం కారణంగా సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

మహేష్ బాబుకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మహేష్ బాబు తాజాగా బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరూలో కొత్తగా ఏర్పాటుచేసిన AMB Cinemas హాల్‌ను ప్రారంభించడానికి మహేష్ బాబు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. ఇక మహేష్ బాబు అక్కడికి ఎంటర్ అవ్వగానే ఆయన కారుని అభిమానులు చుట్టుముట్టేశారు. అభిమానులు తమ అభిమాన హీరోతో సెల్ఫీలు దిగడం కోసం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ఎగబడటంతో మహేష్ బాబు కాసేపు ఎంతో ఇబ్బంది పడుతూ అక్కడే ఇరుక్కు పోయారు

అభిమానుల తాకిడితో గందరగోళం

ఇలా భారీ స్థాయిలో అభిమానులు చేరుకోవడంతో ఆ ప్రాంతం మొత్తం కాసేపు గందరగోళం వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే హైదరాబాదులో ఏఎంబి సినిమాస్ ఎంతో విజయవంతంగా రన్ అవుతున్న నేపథ్యంలో బెంగళూరులో కూడా ప్రారంభించారు. ఇక దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి డాల్బీ సినిమా అనుభూతిని కలిగించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్న కపాలి థియేటర్ స్థానంలో ఏఎంబి సినిమాస్ ను నిర్మించారు. ఇక ఈ సినిమాస్ ను నేడు మహేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఏఎంబి సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొనడంతో అభిమానులు చుట్టుముట్టేయడంతో ఆయన సెక్యూరిటీ, పోలీసులు ఎంతో శ్రమించి మహేష్ బాబును లోపలికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

వారణాసి షూటింగ్లో బిజీగా మహేష్..

ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్సవం

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం 2027 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరొక ఆరు ఏడు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

మొత్తానికి మహేష్ బాబు బెంగళూరు పర్యటన అభిమానుల కోలాహలంగా ముగిసింది. ఆయన త్వరలో రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.