|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mahesh Babu Krishna : తండ్రి కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా? ఏమేం సినిమాలు..

Published: 06-10-2025, 1:01 AM
Mahesh Babu Krishna : తండ్రి కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా? ఏమేం సినిమాలు..

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి కృష్ణతో ఆయనకున్న అనుబంధం సినిమా రంగంలోనూ కొనసాగింది. కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్రాలు ఎన్ని? ఆ సినిమాల పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కలిసి దాదాపు 11 సినిమాల్లో నటించారు.

2

తండ్రి కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు 5 చిత్రాల్లో నటించారు.

4

కృష్ణ హీరోగా నటిస్తూనే దర్శకుడిగా, కొన్నిటికి నిర్మాతగా కూడా వ్యవహరించారు.

కృష్ణ – మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాలు

Mahesh Babu Krishna : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నప్పుడే సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నారు మహేష్ బాబు. మహేష్ కి తండ్రితో చిన్నప్పట్నుంచి మంచి అనుబంధం ఉంది. కృష్ణతో కలిసి మహేష్ దాదాపు 11 సినిమాలో కలిసి నటించాడు. అంతే కాకుండా తండ్రి దర్శకత్వంలో కూడా నటించాడు మహేష్.(Mahesh Babu Krishna)

కృష్ణ – మహేష్ బాబు కలిసి నటించిన సినిమాలు పోరాటం, శంఖారావం, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బజార్ రౌడీ, అన్నాతమ్ముడు, బాలచంద్రుడు, రాజకుమారుడు, వంశీ, టక్కరిదొంగ. ఇలా ఆల్మోస్ట్ 11 సినిమాల్లో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటించారు. అయితే వీటిలో కొన్ని కృష్ణ డైరెక్ట్ చేయగా తండ్రి దర్శకత్వంలో నటించే ఛాన్స్ దొరికింది మహేష్ బాబుకి.

తండ్రి కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాలు

సూపర్ స్టార్స్ తండ్రి-కొడుకుల సినీ ప్రస్థానం

కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు.. 1987లో శంఖారావం, 1988లో ముగ్గురు కొడుకులు, 1989లో కొడుకు దిద్దిన కాపురం, 1990లో అన్నాతమ్ముడు, 1990లో బాలచంద్రుడు.. ఇలా 5 సినిమాల్లో నటించాడు. ఈ అయిదు సినిమాల్లోనూ కృష్ణ మెయిన్ లీడ్ కావడం గమనార్హం. ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క డైరెక్షన్ చేస్తూ మరో పక్క కొడుకుని కూడా డైరెక్ట్ చేసారు కృష్ణ. వీటిలో కొన్నిటికి ఆయనే నిర్మాత కావడం గమనార్హం.

మహేష్ బాబు బాలనటుడిగా, యువ హీరోగా తండ్రి కృష్ణతో, ఆయన దర్శకత్వంలో కలిసి పనిచేయడం వారి బంధానికి ప్రతీక. ఈ సినిమాలు వారి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.