|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mahesh Babu : రాజమౌళి వల్ల కొడుకు బర్త్ డే మిస్ అయిన మహేష్.. ఎమోషనల్ పోస్ట్.. గౌతమ్ కి ఇప్పుడు ఎన్నేళ్లు..?

Published: 31-08-2025, 12:49 AM
Mahesh Babu : రాజమౌళి వల్ల కొడుకు బర్త్ డే మిస్ అయిన మహేష్.. ఎమోషనల్ పోస్ట్.. గౌతమ్ కి ఇప్పుడు ఎన్నేళ్లు..?

ప్రముఖ నటుడు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కొడుకు గౌతమ్ పుట్టినరోజును మిస్ అయ్యారు. దీనిపై ఆయన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Key Points

1

మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

2

కొడుకు గౌతమ్ పుట్టినరోజును మొదటిసారిగా మిస్ అయ్యారు.

4

గౌతమ్ ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నాడు.

రాజమౌళి సినిమా షూటింగ్

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆఫ్రికా కెన్యా దేశంలో ఈ షూటింగ్ జరుగుతుంది. అయితే నేడు మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన రోజు కావడంతో మొదటిసారి నీ బర్త్ డే ని మిస్ అవుతున్నాను అంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.(Mahesh Babu)

మహేష్ బాబు తన కొడుకుతో దిగిన పాత ఫోటో షేర్ చేసి.. హ్యాపీ 19 మై సన్. ప్రతి సంవత్సరం నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్నావు. ఈ సంవత్సరం నేను నీ పుట్టిన రోజుని మిస్ అవుతున్నాను. ఇన్నేళ్ళలో నేను మిస్ అయింది ఇదే. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుంది. నువ్వేం చేసినా ఎప్పుడూ నేను నీకు సపోర్ట్ ఉంటాను. నువ్వు ఇంకా ప్రకాశించాలి, ఎదగాలి అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఎమోషనల్ పోస్ట్

ఈ సంవత్సరంతో గౌతమ్ కి 19 ఏళ్ళు వచ్చాయని, రాజమౌళి షూటింగ్ వల్లే మహేష్ మొదటిసారి తన కొడుకు పుట్టిన రోజుకి దూరంగా ఉన్నాడని తెలిపాడు మహేష్. ఇక గౌతమ్ ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు.

గౌతమ్ ఘట్టమనేని

మహేష్ బాబు తన కొడుకుతో ఉన్న ప్రేమను ఈ పోస్ట్ ద్వారా చూపించారు. గౌతమ్ భవిష్యత్తులో మంచి నటుడుగా ఎదగాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.