|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ లైఫ్.. రొమాంటిక్ లవ్ స్టోరీగా మహేష్ బాబు మేనల్లుడి కొత్త సినిమా ‘వీసా’.. డిఫరెంట్ టైటిల్, టీజర్

Published: 12-07-2025, 4:49 PM
అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ లైఫ్.. రొమాంటిక్ లవ్ స్టోరీగా మహేష్ బాబు మేనల్లుడి కొత్త సినిమా ‘వీసా’.. డిఫరెంట్ టైటిల్, టీజర్

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన ‘వీసా: వింటారా సరదాగా’ అనే కొత్త సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. అమెరికాలోని తెలుగు విద్యార్థుల జీవితాలను, ప్రేమను ఈ సినిమా చూపుతుంది.

Key Points

1

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కొత్త సినిమా ‘వీసా: వింటారా సరదాగా’ టీజర్ విడుదల.

2

అమెరికాలో తెలుగు విద్యార్థుల జీవితం, ప్రేమ కథ నేపథ్యంలో సినిమా తెరకెక్కడం.

4

సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాణం.

‘వీసా: వింటారా సరదాగా’ టీజర్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అతని కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మూవీ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. శనివారం (జూలై 12) ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రిలీజైంది. అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ లైఫ్, యూత్ లవ్ స్టోరీని ఎంగేజింగ్ గా ఈ మూవీ చెప్పబోతున్నారని టీజర్ చూస్తే స్పష్టమవుతుతోంది.

అశోక్ గల్లా కొత్త సినిమాకు ‘వీసా: వింటారా సరదాగా’ టైటిల్ పెట్టారు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగనుంది. అమెరికా వెళ్లాలంటే వీసా కష్టాలు పడాల్సిందే. అందుకే సింబాలిక్ గా వీసా పేరును పెట్టి.. వింటారా సరదాగా అనే అర్థాన్నిచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్ ను శనివారం రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

అమెరికా నేపథ్యంలో రొమాంటిక్ కథ

‘వెల్ కమ్ టు మా పాడ్ కాస్ట్ సిరీస్ వీసా’ అంటూ హీరో అశోక్ గల్లా టీజర్ లో ఎంట్రీ ఇస్తాడు. ఆంధ్ర, తెలంగాణ తర్వాత మన తెలుగు వాళ్లు బాగా కనెక్ట్ అయిన స్టేట్.. యునైటెడ్ స్టేట్స్ అని డైలాగ్ వేస్తాడు. ఆ తర్వాత మాస్టర్స్ కోసం అమెరికా వచ్చిన తెలుగు స్టూడెంట్ల కష్టాలను ఫన్నీగా చూపించారు. రూ.50 లక్షల కట్నం ఎక్కువగా వస్తుందని మా నాన్న ఇక్కడికి పంపించాడు భయ్యా అనే డైలాగ్ వినిపిస్తోంది.

అమెరికా పబ్ కల్చర్, వెస్టర్న్ సంప్రదాయం, అమ్మాయిలు, హాట్ అందాలు.. ఇలా అక్కడి వాతావరణం చూపించారు. కానీ ఎక్కడైనా తప్పని, తప్పించుకోలేని ప్రాబ్లెం ఒకటుంది.. ప్రేమ అనే డైలాగ్ తో ఈ మూవీ న్యూ ఏజ్ లవ్ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతుందనేలా కనిపిస్తుంది. టీజర్ లో కిస్, బెడ్ సీన్లు కూడా ఉన్నాయి.

యువతకు ఆకర్షణీయమైన కంటెంట్

ఈ సినిమాలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఉద్భవ్ రఘు డైరెక్టర్. సితారా ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్.

హీరో మూవీతో డెబ్యూ చేసిన అశోక్ గల్లాకు ఇది మూడో సినిమా. ఆ తర్వాత దేవకి నందన వాసుదేవ సినిమా చేశాడు. వీసా మూవీ అశోక్ గల్లాకు మూడోది. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి తనయుడే అశోక్ గల్లా. అశోక్ కు మహేష్ బాబు మేనమామ.

అశోక్ గల్లా నటన, కథ, సంగీతం అన్నీ కలిసి ‘వీసా: వింటారా సరదాగా’ సినిమాను ఆసక్తికరంగా మార్చే అవకాశం ఉంది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.