
📌 Key Points
- ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ మార్చి 5న విడుదల, దేశభక్తి కథాంశంతో భారీ యాక్షన్ సీక్వెన్స్!
- మహేష్ బాబు ‘వారణాసి’ మార్చి 25న థియేటర్లలో విడుదల, ఒకే సినిమాలో ఐదు పాత్రల్లో అదరగొట్టనున్న మహేష్!
- జక్కన్న దర్శకత్వంలో ‘వారణాసి’ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని అంచనా, టైటిల్ టీజర్ ట్రెండింగ్‌లో నిలిచింది.
- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు, తృప్తి డిమ్రి హీరోయిన్!
టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే.. మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలు ఒకే నెలలో విడుదల కానుండటం! ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల తేదీ ఖరారు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటింగ్ సినిమాలు స్పిరిట్, వారణాసి. భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాల నడుమ ఈ రెండు సినిమాలు వస్తున్నాయి. అందులోనూ ఈ రెండు సినిమాలను తీసేది 100% సక్సెస్ రేటు ఉన్న దర్శకులే కావడం గమనార్హం. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపిస్తారట.
మహేష్ బాబు ‘వారణాసి’లో ఐదు పాత్రలు!
దేశ భద్రత నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నట్లు నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పోస్టర్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది. ఇక అటు జక్కన్న దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా టైటిల్ టీజర్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ సినిమాలో ఏకంగా మహేష్ బాబు ఐదు పాత్రల్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందట.
జక్కన్న, సందీప్ రెడ్డి వంగా.. ఇద్దరి మధ్య పోటీ!
బడా సినిమాలు వారణాసి, స్పిరిట్ రెండు సినిమాలు కూడా 2027 మార్చిలో రిలీజ్ కాబోతున్నాయి. అంటే ఈ నెలలో మంచి స్టఫ్ తెలుగు అభిమానులకు దొరకనుంది. మార్చి 5వ తేదీన స్పిరిట్ మూవీ రిలీజ్ కానుండగా.. మార్చి 25వ తేదీన మహేష్ బాబు నటించిన వారణాసి రిలీజ్ అవుతుంది. దీంతో ఇండస్ట్రీ కళ్ళు మొత్తం ఈ రెండు సినిమాల పైన పడ్డాయి. రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈ రెండు సినిమాల నడుమ మరే సినిమా వచ్చినా, షెడ్డు కు వెళ్లాల్సిందే అంటున్నారు.
మొత్తానికి మార్చి నెల టాలీవుడ్ అభిమానులకు పండగే. రెండు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటి ఫలితాల కోసం వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


