|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షేక్ చేస్తున్న మహేష్ బాబు ప్రీ లుక్.. రాజమౌళి టైటిల్ రివీల్ చేశారా? గ్లోబ్ ట్రాటర్ అంటే ఏంటీ? ఫొటోలో ఏముంది?

Published: 09-08-2025, 5:12 AM
షేక్ చేస్తున్న మహేష్ బాబు ప్రీ లుక్.. రాజమౌళి టైటిల్ రివీల్ చేశారా? గ్లోబ్ ట్రాటర్ అంటే ఏంటీ? ఫొటోలో ఏముంది?

సోషల్ మీడియాలో మహేష్ బాబు ప్రీ-లుక్ ఫోటో వైరల్‌గా మారింది. రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించడంతో సినిమా టైటిల్‌పై చర్చ జరుగుతోంది. ఫొటోలోని వివరాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

మహేష్ బాబు ప్రీ-లుక్ సోషల్ మీడియాలో వైరల్.

2

రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' హ్యాష్‌ట్యాగ్‌తో కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నారు.

4

సినిమా టైటిల్ 'గ్లోబ్ ట్రాటర్' అవుతుందా లేదా అన్నది అనిశ్చితం.

మహేష్ బాబు ప్రీ-లుక్ వైరల్

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే ట్రెండింగ్. ఎక్కడ చూసినా ఒకటే ప్రశ్న. ఎస్ఎస్ఎంబీ 29 మూవీ నుంచి మహేష్ బాబు ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి కొత్త ప్రశ్న రేకెత్తించారు. మూవీ టైటిల్ ను ఆయన రివీల్ చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పదానికి రాజమౌళి యాష్ ట్యాగ్ ఇవ్వడమే అందుకు కారణం. ఇప్పుడీ కొత్త యాష్ ట్యాగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

ఇన్ని రోజులు మహేష్ బాబు , ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో పిలిచారు. కానీ ఇప్పుడీ మూవీకి కొత్త పేరు వచ్చింది. అదే.. ‘గ్లోబ్ ట్రాటర్’. ఈ యాష్ ట్యాగ్ తోనే మూవీ టీమ్ సోషల్ మీడియాలో అప్ డేట్లు ఇస్తున్నారు. దీంతో ఇదే సినిమా అఫీషియల్ టైటిల్ హా అనే డౌట్లు వస్తున్నాయి. మరి ఇదే సినిమా పేరు అవుతుందా? లేదా కేవలం ప్రమోషనల్ యాష్ ట్యాగ్ హా అన్నది తెలియాల్సి ఉంది. గ్లోబ్ ట్రాటర్ అంటే.. ప్రపంచ దేశాలకు తరచుగా ట్రావెల్ చేసే వ్యక్తి అని అర్థం.

‘గ్లోబ్ ట్రాటర్’ టైటిల్ రివీల్?

ఎస్ఎస్ఎంబీ 29 నుంచి మహేష్ బాబు ప్రీ లుక్ అంటూ రిలీజ్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా శనివారం (ఆగస్టు 9) ఉదయం ఈ ఫొటో రిలీజ్ చేశారు. ఇందులో రక్తపు మరకలు ఉన్న లో కట్ దుస్తులను ధరించిన హీరో మెడలో.. శివుని త్రిశూలం, వాహనం నంది, అడ్డంగా మూడు నామాలు ఉన్న పెండెంట్ కనిపిస్తోంది. దీంతో ఫారెస్ట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివుడి బ్యాక్ డ్రాప్ ఉంటుందేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శివునికి సంబంధించినది ఏదైనా వెతికేందుకు హీరో ప్రయాణం కొనసాగిస్తాడా? అనే డౌట్ వస్తుంది.

“భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డియర్ సినిమా లవర్స్, అలాగే మహేష్ అభిమానులు. మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలమైంది. ఈ చిత్రం గురించి తెలుసుకోవడానికి మీ ఆత్రుతను మేము అభినందిస్తున్నాము. అయితే ఈ సినిమా కథ, పరిధి చాలా విశాలంగా ఉండడంతో కేవలం ఫొటోలు, ప్రెస్ మీట్లు మాత్రమే న్యాయం చేయలేవని నా అభిప్రాయం.

ఫొటోలోని రహస్యాలు

మేము సృష్టిస్తున్న సారం, లోతు, అంతర్లీన ప్రపంచాన్ని ప్రదర్శించడానికి మేము ప్రస్తుతం ఏదో ఒకటి చేస్తున్నాము. దీన్ని నవంబర్ 2025 లో మీ ముందుకు తెస్తాం. మునుపెన్నడూ చూడని దాన్ని రివీల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మీ సహనానికి ధన్యవాదాలు’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘గ్లోబ్ ట్రాటర్’ అనేది టైటిల్ అవుతుందో లేదో వచ్చే నవంబర్ వరకు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.