
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే SSMB29 సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ మెడలో ఉన్న లాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Key Points
SSMB29 పోస్టర్ లో మహేష్ మెడలోని లాకెట్ వైరల్ గా మారింది.
లాకెట్ లో త్రిశూలం, మూడు నామాలు, ఢమరుకం, నంది, రుద్రాక్ష ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ లాకెట్ లాగానే ఇది కూడా సేల్స్ లో బాగా పాపులర్ అవుతుందని అంచనా.
శివుడి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథకు సంబంధం ఉందేమో అని అనుమానాలు.
SSMB29 పోస్టర్ వైరల్
Mahesh Babu : రాజమౌళి – మహేష్ బాబు సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోయినా నేడు మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి SSMB29 సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఒక పోస్టర్ రిలీజ్ చేసి నవంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వస్తుంది అంటూ ప్రకటించారు.
అయితే రాజమౌళి, మహేష్ షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో మహేష్ ఫేస్ కనిపించకపోయినా మెడలో ఒక లాకెట్ ఉంది. ఓ మాలకు ఆ లాకెట్ తగిలించారు. ఈ లాకెట్ లో మూడు నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది, రుద్రాక్ష ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. దీంతో ఈ లాకెట్ వైరల్ గా మారింది. ఈ లాకెట్ చూసి బాహుబలి లాగే ఈ సినిమాలో శివుడి బ్యాక్ డ్రాప్ లో కూడా కాస్త కథ ఉంటుందేమో అనుకుంటున్నారు.
మహేష్ మెడలోని లాకెట్ రహస్యం
గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సమయంలో చేతికి కట్టుకున్న ఓం లాకెట్ బాగా వైరల్ అయి, బయట సేల్స్ కూడా బాగా జరిగిన సంగతి తెలిసిందే. అలాగే బ్రో సినిమా సమయంలో కూడా పవన్ మెడలో ఉన్న లాకెట్ వైరల్ అయి సేల్స్ బాగా అయ్యాయి. ఆ లాకెట్ లో కూడా త్రిశూలం, మూడు నామాలు, ఓం, నంది తల ఉంటాయి. ఇప్పుడు మహేష్ పోస్టర్ లో ఈ లాకెట్ నే ఫోకస్ చేయడంతో ఈ లాకెట్ కూడా బయట మార్కెట్ లోకి త్వరలోనే వచ్చి వైరల్ అవుతుందని తెలుస్తుంది. మరి సినిమాలో ఈ లాకెట్ కి ఎంత కీలక పాత్ర ఉందో ఫస్ట్ అప్డేట్ లోనే దీన్ని రివీల్ చేసారు.
పవన్ కళ్యాణ్ లాకెట్ తో పోలిక
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB29 సినిమాపై ఆసక్తికర అంశాలతో ఈ లాకెట్ సినిమా విజయానికి దోహదపడుతుందని అనిపిస్తుంది.


